proclaimed godsman Swami Om arrested on theft charges దొంగతనాలు చేసి పోలీసులకు చిక్కిన ‘దొంగ’బాబా

Former bigg boss contestant swami om arrested on theft charges

Swami Om, Vinodanand Jha, Saket court, Pramod Jha, Bigg Boss contestant Swami Om, theft charges, crime

self-styled godman Swami Om was arrested in a case filed by his brother who had accused the former Bigg Boss contestant of stealing bicycles along with some documents from his shop.

దొంగతనం అభియోగంపై బాబా స్వామీ ఓం అరెస్టు..

Posted: 08/10/2017 06:54 PM IST
Former bigg boss contestant swami om arrested on theft charges

తనకు తాను దైవదూతగా చెప్పుకున్న వివాదాస్పద స్వామీజీ.. తొమ్మిదేళ్ల నాటి దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట చేశారు. అవునా..  తొమ్మిదేళ్ల క్రితం దొంగతనం చేస్తే ఇప్పుడు అరెస్టు చేస్తారా..? అంటే నేరం ఎప్పటికైనా నేరమే కదా. వివాదాస్పద స్వామీజీ స్వామి ఓంపై దొంగతనం కేసులో అభియోగాలు నమోదు కావడంతో.. పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. హిందీ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న దేశరాజధాని నగరం ఢిల్లీలోని లోధి కాలనీలో పోలీసులు అరెస్టు చేశారు.

తన సైకిల్ దుకాణం తాళాలు పగుల గొట్టి అందులోని 11 సైకిళ్లు, వాటి విడి భాగాలుతో పాటు తన అస్తికి సంబంధించిన పలు విలువైన డాక్యూమెంట్లను స్వామి ఓం దొంగలించాడని ఆయన సోదరుడు ప్రమోద్ ఝా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పట్లో పోలీసులు ఈ కేసును నమోదు చేయలేదు. స్వామీ ఓం లాంటా గురువులతో తమకెందుకు అనుకున్నారో ఏమో తెలియదు కానీ పెద్దగా పట్టించుకోలేదు. తన దుకాణం తాళాలు పగుల గోట్టి స్వామీ ఓంగా పేరు మార్చుకున్న తన అన్న వినోదానంద ఝా తన ఇంటి సేల్ డీడ్ సహా పలు పత్రాలను దొంగలించాడని ప్రమోద్ ఝా పోలీసులకు పిర్యాదు చేశాడు.

పోలీసులు కేసు నమోదు చేసేందుకు కూడా సంశయించడంతో పలుమార్లు పోలీసుల చుట్టూ తిరిగిన అయన ఇక చేసేది లేక న్యాయస్థానాన్ని అశ్రయించి ప్రైవేటు కంప్లేంట్ దాఖలు చేశారు. దీంతో సాకేత్ కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న స్వామి ఓంని ఢిల్లీలోని భజనపురాలో అదుపులోకి తీసుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు, పనులు చేయడం ద్వారా గతంలో పలుమార్లు పలువురి చేతుల్లో దేహశుద్ది చేయబడిన స్వామీ ఓంను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేయడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles