Uttar Pradesh primary school turns into a dance bar సీపీఎం జాతీయ కార్యదర్శిపై దాడికి యత్నం..

Primary school in up turns into a dance bar on raksha bandhan

school turned into dance bar, tetriya primary school dance bar, bar girls dance mirzapur, bar girls dance, bar girls dance mirzapur, mirzapur, primary school, dance bar, bar girls, raksha bandhan, Tetriya village, Jamalpur, Uttar pradesh

A government primary school, situated in Tetriya village of Jamalpur in Uttar Pradesh's Mirzapur District was turned into a dance bar on the occasion of Raksha bandhan.

గ్రామ పాఠశాలలో బార్ గళ్స్ తో అసభ్య నృత్యాలు

Posted: 08/10/2017 06:01 PM IST
Primary school in up turns into a dance bar on raksha bandhan

ఊరిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని గ్రామ స్థాయి ఎన్నికలలో హామీలను గుప్పించిన ఆ గ్రామ పెద్ద నిజంగానే… ఆ గ్రామాన్ని అకస్మాత్తుగా అభివృద్ది చేశారు. ఎంతలా అంటే.. ఏకంగా ఆ పాఠశాల పేరు ఇప్పుడు జాతీయ దినపత్రికలు మొదలుకుని అంతటా మార్మోగిపోతుంది. ఇక ఆ గ్రామ పెద్ద చేసిన పనికి చుట్టుపక్కల గ్రామపెద్దలు కూడా అవ్వాక్కయ్యేలా చేశారు. వారికి తెలియకుండానే వారు కూడా అందులో భాగం పంచుకున్నారు. ఇదేంటి..? ఒక గ్రామ పాఠశాల పేరు ఇంతలా మార్మోగిపోడానికి కారణమేంటి.. అందుకు ఇరురుపోరుగు గ్రామపెద్దలు ఎలా దోహదపడ్డారని అంటున్నారా..? అక్కడికే వస్తున్నాం.

గ్రామపెద్ద చేసిన నిర్వాకంతో ఆ గ్రామస్థులు తలదించుకుంటున్నారు. గ్రామపెద్దగా చెలామణి అవుతూ గ్రామం పరువునే తీసాడు. సభ్యసమాజానికి సందేశం ఇవ్వాల్సిన పెద్ద.. సమాజంలో తమకు మర్యాద లేకుండా చేశాడని పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మొదలుకుని గ్రామ ప్రజలందరూ ఆయనపై పళ్లు కొరుకుతున్నారు. ఇంతకీ ఆయన చేసిందేమిటీ అని ప్రశ్నిస్తే.. ఏకంగా తమ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక స్కూల్ ను క్లబ్ లా మార్చి.. బార్ గాళ్స్ తో డ్యాన్సులు చేయించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మిర్జాపూర్ జిల్లాలో జరిగింది.

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకైన రాఖీ పౌర్ణమి పండుగ రోజునే బార్ గాళ్స్ తో డాన్సులు వేయించి.. వార్తల్లో నిలిచాడు. మిర్జాపూర్‌ జిల్లా జమాల్పూర్ లోని టెట్రాహియ కళా ఖుర్ద్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రక్షాబంధన్ రోజు జరిగిందీ ఘటన, బార్ గాళ్స్ అసభ్య నృత్యాలకు తమ కుటంబంలోని కొందరు వ్యక్తులు అనుకరిస్తూ డాన్సులు చేయగా, మరికొందరు ఇరుగుపోరుగు గ్రామాలకు చెందిన పెద్దమనుషులు తమ జేబుల్లోని నోట్లు తీసి బార్ గాళ్స్ పై విసురారు. ఈ వీడియో బయటకు రావడంతో గ్రామస్థులలో కలకలం సృష్టించింది.

మరుసటి రోజు టీచర్లు పాఠశాలకు రాగానే తరగతి గదులు మొదలుకుని పాఠశాల అవరణ అంతా చిందర వందరంగా ఉంది. దీంతో ఆరా తీసిన ఉపాద్యాయులకు అసలు విషయం అర్థమైంది. తన కుమారుడి జన్మదినం సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని.. గ్రామ పెద్ద రామ్ కేశ్ యాదవ్ తన దగ్గరకు వచ్చి స్కూల్ తాళాలు తీసుకున్నాడని.. పాఠశాల అసిస్టెంట్  టీచర్ అశోక్ కుమార్ ప్రాథమిక శిక్షా అధికారి ప్రవీణ్ కుమార్ తివారీకి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ ప్రారంభించారు అధికారులు. అయితే బార్ గాల్స్ డాన్సులపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mirzapur  primary school  dance bar  bar girls  raksha bandhan  Tetriya village  Jamalpur  Uttar pradesh  

Other Articles

 • Dancers arrested in east godavari for obscene dances

  యువకుల నడుమ.. అర్థనగ్న నృత్యాలు..

  Jan 18 | తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరుపుకున్నారు. అయితే ఇంకా పలు ప్రాంతాల్లోని యువత మాత్రం ఈ సంబరాల జోష్ నుంచి పక్కకు తప్పుకోలేకపోతుంది. దీంతో యువతను అట్రాక్ట్ చేసేందుకు కొందరు... Read more

 • Mothkupalli narsimhulu sensational comments on tdp

  టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయండీ: మోత్కుపల్లి

  Jan 18 | తెలంగాణలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పార్టీ అధిష్టానంపై గత కొంత కాలంగా ముభావంగానే వుంటూ వస్తున్నారు. గవర్నర్ పదవి నేపథ్యంలో ఊహాత్మక మౌనాన్ని వహించి.. అటు అధికారపక్షంపై కానీ... Read more

 • India today opinion poll says rajinikanth party gets 33 seats

  రజనీకాంత్ రాణించలేడా..? సర్వే తేల్చిన నిజం..!

  Jan 18 | తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాలలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓ వైపు దేశంలోనే ప్రముఖ నటులుగా ఖ్యాతిని సొంత చేసుకున్న... Read more

 • Leonia resorts managing director arrested in bad debts case

  బ్యాంకులకు శఠగోపం.. లియోనియా రిసార్ట్స్ ఎండీ అరెస్ట్

  Jan 18 | బ్యాంకులకు వేల కోట్ల రూపాయల శఠగోపం పెట్టి విదేశాలకు తరలివెళ్లిన కింగ్ ఫిషర్ గ్రూప్ సంస్థల అధినేత విజయ్ మాల్యా ఘటన వెలుగుచూసిన తరుణంలోనే ఇలాంటి మార్గంలోనే పయనిస్తున్న బడాబాబులు ఏకంగా వేల సంఖ్యలో... Read more

 • Telangana techie dies in miami after being hit by speeding truck

  అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలుగు టెక్కీ దుర్మరణం

  Jan 18 | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ మృత్యువాత పడ్డాడు. దక్షిణ ఫ్లోరిడాలోని మియామీలో జరిగిన రోడ్డుప్రమాదంలో కరీంనగర్‌ జిల్లావాసి నరహరి భరత్ రెడ్డి(37) మృతి చెందాడు.... Read more

Today on Telugu Wishesh