Hyderabad Police Arrested Drug Dealer Gabriel డ్రగ్స్ పెడ్లర్ గ్యాబ్రియల్ అరెస్టు.. కొనసాగుతున్న సోదాలు..

Hyderabad task force police arrested drug dealer gabriel

drugs case main accused gabriel arrested, searches in nigerian houses, searches in somalian houses, mian accused, gabreil, nigerian, drugs, hyderabad, rachakonda police, nigerians, drug peddlers, somalians, crime

Hyderabad Task Force Police Arrested Drug Dealer Gabriel and seized Laptop and Cocaine from his house, Rachakonda police search operation in nigerians house.

డ్రగ్స్ పెడ్లర్ గ్యాబ్రియల్ అరెస్టు.. కొనసాగుతున్న సోదాలు..

Posted: 08/10/2017 12:17 PM IST
Hyderabad task force police arrested drug dealer gabriel

తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు గాబ్రియేల్ ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కౌకూర్ ప్రాంతంలోని యాప్రాల్ లో చిక్కిన గాబ్రియేల్ నుంచి  కొకైన్‌, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో అత్యంత కీలకంగా మారిన ఆయన ల్యాప్ టాప్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ డ్రగ్స్ రాకెట్‌లో గాబ్రియేల్ కీలక నిందితుడు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాదులోని డ్రగ్స్ పెడ్లర్లకు గాబ్రియేల్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

రెండేళ్ల బిజినెస్‌ వీసాపై హైదరాబాదుకు గాబ్రియేల్ వచ్చడని గుర్తించిన పోలీసులు.. అయన గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యాడని, అయితే బెయిల్ పై బయటకు వచ్చిన అతను తన పద్దతిని మార్చుకోకుండా మళ్లీ డ్రగ్స్ సరఫరా చేస్తూన్నాడని గుర్తించారు.  వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే అతడు వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. ఈ సారి కేవలం గాబ్రియేల్ ను మాత్రమే కాకుండా అతడు పోలీసుల నుంచి తప్పించుకు తిరగడానికి సహకరిస్తున్న అతడి ప్రియురాలిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

మరోవైపు హైదరాబాద్‌, సైబరాబాద్‌ రాచకొండ పరిధిలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. అసిఫ్ నగర్, రాజేంద్రనగర్, బండ్లగూడ సహా నగరంలోని పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. నైజీరియన్లు, సోమాలియా దేశస్థులు ఉంటున్న ప్రాంతాలను గుర్తించి.. వారి ఇళ్లపై ఏకకాలంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. వీసా గడువు ముగిసినా.. ఇంకా హైదరాబాద్ నగరంలోనే తిష్ట వేసిన వారిన గుర్తించే పనిలో వున్నారు. వీరితో పాటు డ్రగ్ పెడ్లర్లుగా మారిన వారి వివరాలను కూడా గుర్తిస్తున్నారు. హైదరాబాదులో 6 వేలకుపైగా, సైబరాబాద్ రాచకొండ పరిధిలో 4 వేల మందిపైగా నైజీరియన్లు ఉన్నట్టు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mian accused  gabreil  nigerian  drugs  hyderabad  rachakonda police  nigerians  drug peddlers  somalians  crime  

Other Articles

 • Jilted lover stabs married woman at erragadda rythu bazar

  తనను ప్రేమించడం లేదని వివాహితపై కత్తితో యువకుడి దాడి

  Oct 23 | హైదరాబాదులో పట్టపగలు దారుణం జరిగింది. ఎర్రగడ్డలోని రైతుబజార్ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న ఓ వివాహితను ఓ అగంతకుడు కత్తితో దాడి చేయడం పెను కలకలం రేపింది. ఈ ఘటనతో నిత్యం రద్దీగా వుంటే ఎర్రగడ్డ... Read more

 • Cctv captures assault on women in broad daylight man arrested

  ITEMVIDEOS: మిట్టమధ్యాహ్నం.. నడిరోడ్డుపై యువతిపై అత్యాచారయత్నం..

  Oct 23 | విశాఖ జిల్లాలో మతిస్థిమితం లేని యాచకురాలిపై నడిరోడ్డుపై అత్యాచారం జరుగుతుంటే కళ్లప్పగించి చూసిన మనవాళ్లకన్నా.. మిట్టమధ్యాహ్నం నడిరోడ్డుపై వెళ్తున్న యువతిని అటకాయించి అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడి భరతం పట్టిన కేరళవాసులు సో బెటర్... Read more

 • Tamil nadu man sets wife daughters ablaze after being harassed by money lender

  ఘోరం: అప్పిచ్చిన వారి వేధింపులు భరించలేక..

  Oct 23 | తమిళనాడులోని హోరం జరిగింది. అప్పును తీసుకున్న పాపానికి ఆ కుటుంబంలోని చిన్నారులతో పాటు అందరూ అగ్నికి అహుతికావాల్సి వచ్చింది. తీసుకన్న రుణం వడ్డీతో సహా కలిపి తిరిగి చెల్లించినా.. ఇంకా వడ్డీ కిందే ఇచ్చిన... Read more

 • Man masturbate in mumbai local train

  ITEMVIDEOS:మెట్రో రైలులో చెండాలం

  Oct 23 | ముంబై మెట్రో రైల్లో ఓ వ్యక్తి చేసిన చెండాలమైన పని అతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. మహిళల ముందే వికృతమైన పనికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న ఓ యువతి ఆ పనిని వీడియో తీసి... Read more

 • Cbi court denies exemption from court attendence to jagan

  సీబీఐ కోర్టులో వైసీపీ అధినేతకు చుక్కెదురు

  Oct 23 | సీబీఐ ప్రత్యేక న్యాయ‌స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి చుక్కెదురైంది. అక్రమాస్థుల కేసు విచారణలో భాగంగా జగన్ ప్రతి శుక్రవారం సీబిఐ న్యాయస్థానంలో హాజరవుతున్నారు. అయితే రాష్ట్రంలో తాను ప్రధాన ప్రతిపక్షంగా... Read more

Today on Telugu Wishesh