ప్రపంచ మీడియాలో బ్రీటీష్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ అదేనండీ బీబీసీ అంటే ప్రత్యేక స్థానం ఉంది. బీబీసీలో ఒక కథనం ప్రసారమైందంటే అది చాలా కీలకమైన అంశమని చాలా మంది భావిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఉదయం సాయంకాలంతో పాటు ఇక నిద్రకు ఉపక్రమించే సమయాల్లో కూడా ఈ న్యూస్ చానెల్ ను వీక్షించి కానీ వెళ్లని వీక్షకులు వున్నారంటే అది బీబీసీకే సొంతం అనికూడా చెప్పకతప్పదు. ఎంతటి ప్లాష్ న్యూస్ అయినా.. వేగంగా వీక్షకుల ముందుకు తీసుకురావడంతో న్యూస్ ను చూసేవారి సంక్య అంతకంతకూ పెరుగుతుంది.
అయితే ఇలా లక్షలాది మంది టీవీని వీక్షిస్తున్న సమయంలో ఓ దృశ్యం ప్రేక్షకుల కంటపడింది. న్యూస్ ప్రెజెంటర్ సోఫీ రావర్త న్యూస్ చదువుతున్న సమయంలో అమె వెనుకనున్న ఓ స్టాఫర్ ఏకంగా బూతు సినిమాలోని ఓ హాట్ సన్నివేశాన్ని చూస్తూ కనిపించాడు. అయితే తాను వున్నది లవ్ ఛానెల్ వెనకనన్న సంగతి కూడా మర్చిపోయిన స్టాఫర్ తాను పనిచేస్తున్న బీబీసీ ఛానెల్ పరువును తీశాడు. బీబీసి ఛానల్ లో ఇలాంటి ఘటనలు జరగడం దరుదృష్టకరమే అయినా యాజమాన్యం మాత్రం విచారణ జరుపుతున్నాం.. నిజానిజాలు పరిశీలించిన తరువాత తప్పజరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఇక మ్యాటర్ లోకి ఎంటర్ అయితే బీబీసీ ఛానల్ లో సోమవారం అర్ధరాత్రి యాంకర్ సోఫీ రావర్త్ వార్తలు చదువుతున్న సమయంలో బ్యాక్ గ్రౌండ్ లో న్యూస్ రూం కనిపించింది. ఈ సమయంలో ఎడిటింగ్ రూంలో కూర్చున్న ఉద్యోగి ఒకరు కంప్యూటర్ కు హెడ్ సెట్ పెట్టుకుని, అందులో అశ్లీల వీడియోలు చూస్తూ కనిపించాడు. దీనిని గమనించిన ఒక వీక్షకుడు ఆ వెంటనే దానిని రికార్డు చేశాడు. పదిసెకెన్ల నిడివిగల చిత్రాన్ని తన ఫేస్ బుక్ లో 'ఏవండోయ్, ఇది చూశారా?' అంటూ ఆ వీడియోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో ఇది వైరల్ అయింది. బీబీసీలో ఇలాంటి ఘటనను తాను నమ్మలేకపోయానని, అయితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తరువాతే దీనిని నమ్మాల్సి వచ్చిందని తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more