Dipak Misra appointed the next Chief Justice of India కొత్త సీజేఐకి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తాడట..

Punjab mp to challenge dipak misra s appointment as next chief justice

chief justice of india, corruption, Dipak Misra, Kalikho Pul, supreme court, judicial controversy, CJI JS Khehar, Harinder Singh Khalsa

Lok Sabha member from punjab Harinder Singh Khalsa says allegations against Misra such as the one of corruption made by former Arunachal CM Kalikho Pul should be grounds for his disqualification as CJI pick

కొత్త సీజేఐకి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తాడట..

Posted: 08/08/2017 06:58 PM IST
Punjab mp to challenge dipak misra s appointment as next chief justice

భారత 45వ ప్రధాన న్యాయమూర్తి సీజేఐ (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా)గా జస్టిస్ దీపక్ మిశ్రా నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖెహర్ ఈ నెల 27న పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయన విరమణకు ముందు.. గత నెలలో తదుపరి సీజేఐగా జస్టిస్ దీపక్ మిశ్రా పేరును నామినేట్ చేశారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్రా నియామకం దాదాపుగా ఖరారైనట్టే. అయితే దీపక్ మిశ్రాను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించడాన్ని పంజాబ్ కు చెందిన ఎంపీ హరిందర్ సింగ్ ఖాల్సే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

మిశ్రా నియామకానికి వ్యతిరేకంగా తాను ఏకంగా న్యాయపోరాటాన్ని కూడా చేస్తానని ఖాల్సే స్పష్టం చేశారు. ఇవాళ ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దీపక్ మిశ్రా నియామకాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, ఇందుకు ఆయనపై అవినీతి అరోపణలు రావడమే కారణమని అన్నారు. ఈ మేరకు తాను ఢిల్లీ హైకోర్టులో మిశ్రా నియామకానికి వ్యతిరేకంగా రిట్ పిటీషన్ దాఖలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. పంజాబ్ లోని పతేఘర్ సాహిబ్ నుంచి ఎన్నికై.. అప్ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎంపీ.. మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మిశ్రా సీజేఐగా ఎంపికవ్వడం దేశ న్యాయవ్యవస్థకే ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు.

దేశ ప్రధాన న్యాయమూర్తి అంటే కేవలం సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి కాదని, దేశ న్యాయవ్యవస్థ ముఖచిత్రంగా ఆయనను ప్రపంచ దేశాలు పరిగణిస్తాయని ఖాల్సా అభిప్రాయపడ్డారు. కేవలం ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేయడం వల్లే మిశ్రాను సీజేగా నియమించడం సబబు కాదని అన్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో ఎందరో న్యాయకోవిదులు వున్నా.. మిశ్రా కన్నా పెద్ద వయస్సులు కూడా వున్నా.. మిశ్రానే ఎందుకు నామినేట్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం ఖలీఖో పుల్ మరణవాంగ్మూలంలో దీపక్ మిశ్రా పేరును లంచగోండిగా పేర్కోన్నారని, ఆయన మరణవాంగ్మూలన్ని పరిగణలోకి తీసుకుని దీపక్ మిశ్రా ను సీజేగా నియమించరాదని న్యాయసోరాటం చేస్తానని ఖాల్సా అన్నారు.

కాగా, దీపక్ మిశ్రా 1953 అక్టోబర్ 3న పుట్టారు. 1977 ఫిబ్రవరి 14న అడ్వకేట్‌గా నమోదు చేసుకుని రాజ్యాంగ, సివిల్, క్రిమినల్, రెవెన్యూ, సర్వీస్ అండ్ సెల్క్ టాక్స్ వ్యవహారాల్లో ఒడిశా హైకోర్టులో సేవలందించారు. 1996 జనవరి 17న ఒడిశా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1997 మార్చి 3న మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 1997 డిసెంబర్ 19న పెర్మనెంట్ జడ్జిగా నియమితులయ్యారు.2009 డిసెంబర్ 23న పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, 2010 మే 24న ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతులు చేపట్టారు. 2011 నవంబర్ 10న సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోట్ అయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles