officials fine hotel for serving non veg in veg biryani వెజ్ బిర్యానీలో నాన్ వెజ్..! రూ.18వేల జరిమానా.!!

Officials fine hotel for serving non veg in veg biryani

GHMC officials fine hotel, GHMC officials udipi uphaar, amho bindu barghavi fines hotel, udipi uphaar cockraoch veg biryani, GHMC officials, AMHO, Bindhu Bhargavi, fine, hotel udipi uphaar, vegeterian restarant, gachibowli, anjaiah nagar, cockroach biryani, (non veg), veg biryani, Raju

GHMC officials fine hotel udipi uphaar a vegeterian restarant in gachibowli for serving cockroach in (non veg) veg biryani

వెజ్ బిర్యానీలో నాన్ వెజ్..! రూ.18వేల జరిమానా.!!

Posted: 08/05/2017 02:39 PM IST
Officials fine hotel for serving non veg in veg biryani

అది పూర్తిగా శాఖాహార రెస్టారెంటు. అందులోకి మిట్టమధ్యాహ్నం ఓ శాఖాహరి వెళ్లి కడుపు నింపుకునేందుకు తనకు ఎంతో ఇష్టమైన వెజిటెబుల్‌ బిర్యానీని అర్డర్ చేశాడు. సప్లయర్ తీసుకువచ్చిన వెజ్ బిర్యానీని అకలితో నకనకలాడుతున్నందనో ఏమో తెలియదు కానీ అవురావురు మంటూ తినడం ప్రారంభించాడు. అలా నాలుగు ముద్దలు గబగబా తినేసరికి కడుపు నిండినట్లు అయ్యింది. దీంతో మెల్లిగా బిర్యానీని అరగిస్తున్న క్రమంలో అతడు తన బిర్యానీలో మాంసాహారం కలిసిందని గుర్తించాడు. ఇంతలో హోటర్ సప్లయర్ ని పిలిచి అడుగాడు. తనకు సంబంధం లేదని, తనకు కిచెన్ లో వేరే వ్యక్తులు ఇస్తే దానినే తాను తీసుకువచ్చానని చెప్పాడు.

దీంతో అర్థాకలితో వున్న కస్టమర్ ఇక చేసేది లేదని జీహెచ్ఎంసీ అధికారులకు పిర్యాదు చేశాడు. వారు కూడా హుటాహుటిన హోటల్ వద్దకు చేరకుని వెజ్బిర్యానీలోని నాన్ వెజ్ ను పరిశీలించి హోటల్ యాజమాన్యానికి జరిమానా విధించారు. అయితే ఇంతకీ కస్టమర్ కు వెజ్ బిర్యానీలో వచ్చిన నాన్ వెజ్ ఏంటో తెలుసా..? బొద్దింక. అవునండీ వెజ్ బిర్యానీలో బొద్దింక ప్రత్యక్ష కావడంతో కస్టమర్ కంగారుపడి సప్లయర్ ను నిలదీశాడు. అయితే సప్లయర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో జీహెచ్ఎంసీ అధికారులకు పిర్యాదు చేశాడు.

ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందని అంటున్నారు అంతేగా..? గచ్చిబౌలిలోని అంజయ్యనగర్ ప్రాంతంలో గల ఉడిపీ ఉపహార్‌ పేరిట వెజ్‌ రెస్టారెంట్‌ లో చోటుచేసుకుంది. క్రితం రోజు మద్యాహ్నం రాజు అనే శాఖాహారి ఈ హోటల్ లోకి  భోజనానికి వచ్చాడు. వెజిటెబుల్‌ బిర్యానీ ఆర్డర్‌ చేశాడు. బిర్యానీ తింటుండగా అందులో బొద్దింక ప్రత్యేక్షమైంది. దీంతో అతను జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. శేరిలింగంపల్లి సర్కిల్‌ 20 ఏఎంహెచ్‌ఓ బిందుభార్గవి తన సిబ్బందితో పాటుగా వచ్చి సదరు రెస్టారెంట్ యాజమాన్యానికి 18 వేల రూపాయల జరిమానా విధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC officials  AMHO  Bindhu Bhargavi  fine  hotel udipi uphaar  gachibowli  Raju  

Other Articles