Ruthless Ashwin-Jadeja pair dismantles Sri Lanka కొలంబో టెస్టులో ఫాలో-అన్ అడుతున్న శ్రీలంక.. అశ్విన్ పాంచ్ ఫటాకా

Ruthless ashwin jadeja pair dismantles sri lanka

Team India, BCCI, india vs sri lanka, ind vs sl, virat kohli, india cricket, colombo test, virat kohli, shikhar dhawan, cheteshwar pujara, indian cricket news, cricket news, sports news, latest news, sports, cricket

Ravichandran Ashwin and Ravindra Jadeja as the pair dismantled Sri Lanka and enforced follow-on on an action-filled opening session on Day 3 in Colombo.

కొలంబో టెస్టులో ఫాలో-అన్ అడుతున్న శ్రీలంక.. అశ్విన్ పాంచ్ ఫటాకా

Posted: 08/05/2017 01:16 PM IST
Ruthless ashwin jadeja pair dismantles sri lanka

శ్రీలంక పర్యటనను టీమిండియా పూర్తి అధిక్యతను కనబరుస్తుంది. తొలి టెస్టులో అవకాశమున్నా ఫాలో అన్ ను వద్దనుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..  కొలంబో వేదికగా జరగుతున్న రెండో టెస్టులో మాత్రం తప్పక ఫాలో అన్ ను ఎంచుకునే అవకాశాన్ని భారత్ బౌలర్లు కల్పించారు. రెండో రోజు తొమ్మిది వికెట్ల నష్టానికి 622 పరుగులకు చేసిన తరువాత డిక్టేర్ చేసిన టీమిండియా శ్రీలంకను బ్యాటింగ్ కు పిలిచి.. స్వల్ప వ్యవధిలోనే రెండు కీలక వికెట్లను పడగొట్టింది.

దీంతో ఇవాళ రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన లంకేయులపై భారత బౌలర్లు చెలరేగి పోయారు. ఒక్కరంటే ఒక్క బ్యాట్స్ మెన్ ను కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలదొక్కుకోనీయకుండా పదునైన బంతులను విసురుతూ.. వారిని కట్టడి చేస్తూనే వికెట్లను పడగోట్టారు. ఫలితంగా బొజన విరామ సమయానికి లంక కేవలం 183 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు లంకపై 439 పరుగుల అధిక్యతలో వుంది.

మూడో రోజు ఆట ప్రారంభించిన లంకేయులు ఆది నుంచి తడబడుతూనే ఉన్నారు. వికెట్‌ కీపర్‌ నిరోషన్‌ డిక్వెల్లా(51) తప్ప ఏ ఒక్క ఆటగాడు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయాడు. ఓపెనర్‌ ఉపుల్‌ తరంగ, ధనుంజయ డిసిల్వా, నువాన్‌ ప్రదీప్‌ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ బాటపట్టారు. కీలక మ్యాచ్‌లో నలుగురు ఆటగాళ్లు దిముత్‌ కరుణరత్నే(25), కుశాల్‌ మెండీస్‌(24), ఏంజిలో మాథ్యూస్‌(26), దిల్రువన్‌ పెరీరా(25) కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోయారు. 49.4వ ఓవర్లో అశ్విన్‌ వేసిన బంతిని ఎదుర్కొన్న పెరీరా బౌల్డయ్యాడు.

దీంతో మూడో రోజు లంచ్‌ విరామానికి 49.4 ఓవర్లలో 183 పరుగులకే లంక చాప చుట్టేసింది.  భారత స్పిన్ మాంత్రికుడిగా పేరొందిన రవిచంద్రన్‌ అశ్విన్‌ తన స్పిన్‌ మాయాజాలంతో లంక సేనను కట్టడి చేసి తన టెస్టు కెరీర్ లోనే 26వ సారి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను తీసి తన ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్‌కు ఐదు వికెట్లు దక్కగా షమి, జడేజాకి రెండేసి, ఉమేష్‌కి ఒక వికెట్‌ దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  TeamIndia  virat kohli  Test match  colombo test  cricket  

Other Articles