మారణహోమానికి ఐదేళ్లు.. ఓ కొడుకు ఎమోషనల్ సందేశం | Prabhjot Emotional Message on Oak Creek Massacre

Oak creek massacre completed five years

Prabhjot Singh Rathor, Oak Creek Massacre, Oak Creek Gurdwara Massacre, US Gurdwara Massacre, Gurdwara Firing, Gurdwara Prabhjot Singh Rathor, Prakash Singh Rathor Oak Creek

Oak Creek Massacre in Wisconsin at a Gurdwara Completed 5 Years. Prabhjot Singh Rathor S/O Prakash Singh Rathor Emotional Story Melt You.

ఎమోషనల్ స్టోరీ: తండ్రి చనిపోయిన ప్లేస్ లోనే...

Posted: 08/05/2017 10:59 AM IST
Oak creek massacre completed five years

తన కళ్ల ముందే తండ్రి తూటా దెబ్బకు కుప్పకూలిపోయి పడి ఉన్న సన్నివేశం చూసిన ఏ కొడుకైనా మళ్లీ ఇలాంటి పని చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. 17 ఏళ్ల ప్రభ్ జ్యోత్ రాథోర్ తన తండ్రి చెప్పాడన్న ఒకే ఒక్క మాటను ఇప్పటికీ శిరసావహిస్తున్నాడు. ఘోర కలికి కేంద్రమైన మందిరంలో ప్రార్థనలో పాల్గొంటూనే ఉన్నాడు. ఐదేళ్ల క్రితం జరిగిన విస్కాన్సిన్ మారణహోమానికి నేటితో ఐదేళ్లు నిండాయి.

ఐదేళ్ల క్రితం ఆగష్టు 5, 2012 న విస్కాన్సిన్ సిక్కు మందిరంలోకి ప్రవేశించిన మైకేల్ ఫేజ్ అనే ఓ మహిళతో సహా వ్యక్తి ఆరుగురిని పొట్టనపెట్టుకున్నాడు. ఘటనలో ప్రభ్ జ్యోత్ తండ్రి కూడా మరణించాడు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఫేజ్ ను చంపేశాయ్. అప్పటిదాకా సిక్కు అనే ఓ జాతి ఉందన్న విషయం అమెరికాకు తెలియలేదు. నల్లజాతీయులపైనే కాకుండా ఇతర దేశాలకు చెందిన వారిపై దాడులకు పాల్పడటానికి ఇదే బీజమైందని చెప్పుకోవచ్చు.

Oak Creek Incident

పెల్లు బిక్కిన జాతి వివక్షతపై తీవ్ర స్థాయిలో నిరసనలు వినిపించాయి. ప్రపంచ దేశాలన్నీ ఈ ఘటనను ముక్త కంఠంతో ఖండించాయి. అందులో చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతితోపాటు ఆర్థిక సాయం అందింది. అయితే తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులు ఇప్పటికీ ఈరోజును తలుచుకుని రోదిస్తూనే ఉంటారు.

‘నాకు అప్పుడు 12 ఏళ్లు. నాకు బాగా గుర్తుంది. ఇండియా నుంచి అప్పుడే అమెరికాకు వెళ్లాను. ఆరోజు అమ్మా, నేను, చెల్లి ప్రార్థన కోసం అక్కడికి(విస్కాన్సిస్ గురుద్వారా) వెళ్లాం. నాన్న వచ్చే వాళ్ల కోసం భోజనాలు సిద్ధం చేస్తున్నారు. నేను, పల్మిత్(చెల్లి) ఆడుకుంటున్నాం. అమ్మ మాకు కొద్ది దూరంలో ఉంది. ఇంతలో శబ్ధాలు వచ్చాయి. పటాసులు పేలుస్తున్నారేమో అనుకున్నా. కాసేపటికి అది తుపాకుల మోత అని అరుపులతో తెలిసిపోయింది. నాన్న చనిపోయాడంటూ ఓ వ్యక్తి వచ్చి చెప్పాడు. నాకేం అర్థం కానీ పరిస్థితి. ఆ మరుసటి రోజు ఏడుస్తున్న అమ్మను చూసి, నాన్న తిరిగి రాడని అర్థమైపోయింది.

ఇప్పుడు నాకు 17 ఏళ్లు. పరిస్థితులు అర్థం చేసుకునే శక్తి వచ్చింది. చిన్నప్పుడు నాన్న చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చాయి. ప్రతీ ఆదివారం గురుద్వార్ లో జరిగే ప్రార్థనలకు వెళ్లి.. సహయక కార్యక్రమాల్లో పాల్గొంటే పుణ్యం వస్తుందని ఆయన చెప్పాడు. నాన్న చెప్పాడు. అందుకే ఆయన కోరికను తీరుస్తున్నా. ఆ విషాద ఘటనను దిగమింగుకుని ఇప్పటికీ అక్కడి వెళ్లి ప్రార్థనలు చేస్తున్నా’’ అంటూ ప్రభ్ జ్యోత్ చెబుతున్నాడు.

Oak Creek Gurudwara Incident 5 Years

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oak Creek  Gurudwara Massacre  Racism Attack  

Other Articles