షాక్: మైత్రీ వనం వద్ద రోడ్డుపైనే డ్రగ్స్ అమ్మకం.. | Drug racket busted at Ameerpet 7 Arrested

Drug racket again busted in hyderabad

Hyderabad, Hyderabad Drug Arrestm Ameerpet Drug Arrest, Mytrivanam Drug Case, Drug Case, Siddipet Drug Case, Task Force Police Drug Case

Drug Racket again busted in Hyderabad. Local made Drugs sold at Ameerpet Mytrivanam Roads. Seven People Arrested by Task Force Police.

షాక్: అర్థరాత్రి మళ్లీ డ్రగ్స్ కలకలం

Posted: 08/04/2017 11:28 AM IST
Drug racket again busted in hyderabad

ఓవైపు మాదక ద్రవ్యాల ఇష్యూపై తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నాడు. ఎక్సైజ్ శాఖ, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ బృందం కూడా ఆ మూలాలు వ్యాప్తిచెందకుండా చూస్తామంటూ భరోసా ఇస్తున్నాయి. ఇంతలోనే మరోమారు డ్రగ్స్ కలకలం చెలరేగింది.

హైదరాబాద్ నడిబొడ్డున అర్థరాత్రి పలు కోచింగ్ సెంటర్ లకు కేంద్రం అయిన అమీర్ పేటలో డ్రగ్స్ అమ్మకం వెలుగుచూసింది. మైత్రీవనం వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న ఏడుగురిని గురువారం రాత్రి
పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2.5 కిలోల అల్ఫ్రాజోలం, అరకిలో డైజోఫామ్ టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని ప్రస్తుతం విచారిస్తున్నామని, కోర్టు ముందు ప్రవేశపెట్టి, ఆపై కస్టడీకి తీసుకుంటామని తెలిపారు.

అయితే వారు ఎవరెవరికి మత్తు పదార్థాలు సరఫరా చేశారన్న విషయమై వారి సెల్ ఫోన్లను విశ్లేషిస్తున్నట్టు తెలిపారు. రోడ్డుపై వీరి దందా కొనసాగుతోందన్న పక్కా సమాచారం తమకు అందంటతో ఈ దాడులు నిర్వహించామని తెలిపారు. నిందితులు సిద్దిపేట ప్రాంతానికి చెందిన వారని వెల్లడించిన పోలీసులు, బాన్స్ వాడ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నుంచి డ్రగ్స్ అందుకుని, నగరంలోని మరో వ్యక్తికి ఇచ్చేందుకు వచ్చారని వెల్లడించారు. మరోవైపు నిబంధనలను ఉల్లంఘిస్తున్న పబ్ ల విషయంలోనూ ఉక్కుపాదం మోపుతూ సీజ్ లు చేసుకుంటూ వెళ్తోంది టీ ఎక్సైజ్ శాఖ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Drug Case  Task Force Police  

Other Articles

 • Saravana bhavan founder p rajagopal serving life term dies in chennai

  ‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

  Jul 18 | అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన శరవణ భవన్‌ యజమాని పి. రాజగోపాల్‌ మృతిచెందాడు. హత్యకేసులో కోర్టులో లొంగిపోయిన కొద్ది రోజులకే గుండెపోటుకు గురైన రాజగోపాల్‌ చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయినట్లు ఆయన సన్నిహిత వర్గాలు... Read more

 • Ktr responds to director maruthi s tweet over water supply in hyderabad

  కేటీఆర్‌ సర్.. నేను విన్నది నిజమేనా!

  Jul 17 | ప్రముఖ దర్శకుడు మారుతి అడిగిన ఓ ప్రశ్నకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ట్విటర్‌ వేదికగా సమాధానమిచ్చారు. హైదరాబాద్‌ నగరాన్ని తాగునీటి కష్టాలు వెంటాడనున్నాయా అని మారుతి అడగ్గా అలాంటేదేమీ జరగదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.‘హైదరాబాద్‌కు... Read more

 • Supreme court to take decision on petition of karnataka rebel mlas today

  కర్ణాటక సంక్షోభం.. కీలక తీర్పు ఇవ్వనున్న సుప్రీం!

  Jul 17 | మలుపులు తిరుగుతున్న కర్ణాటక రాజకీయానికి సుప్రీంకోర్టు చెక్ పెడుతుందా? తీర్పు ఎలా ఉండబోతోంది? దాదాపు నెల రోజులుగా పరిపాలన అటకెక్కి... వ్యూహాలు, ప్రతివ్యూహాలతో వేడెక్కిన కర్ణాటకలో స్వార్థ రాజకీయాలకు ఇవాళ బ్రేక్ పడే అవకాశాలు... Read more

 • Trafic challans on violation of motor vehicle rules

  బంబేలెత్తిస్తున్న ట్రాఫిక్ జరిమానాలు..!

  Jul 16 | ఎన్నాళ్ల నుంచో వాహనదారులను బెంబేలెత్తిస్తున్న అధిక జరిమానాల పోటు బిల్లు పార్లమెంటులోకి వచ్చి చేరింది. దీంతో ఎన్ని తప్పులు చేసినా ఇన్నాళ్లు పోతే కొంతేగా అని యధేశ్చగా తప్పులను చేసినా వారి గుండెల్లో ఇక... Read more

 • Biswabhusan harichandan appointed as new andhra pradesh governor

  ఏపీకి కొత్త గవర్నర్‌

  Jul 16 | ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ను కేంద్రం కేటాయించింది. ఒడిశాకు చెందిన భాజపా సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర... Read more

Today on Telugu Wishesh