White snake with 'incredibly rare mutation' శ్వేతనాగు విషయంలో క్లారిటీ ఇచ్చిన అధికారులు

White snake with incredibly rare mutation discovered in australia

cobras, white cobra, guindy, rare snakes, tiruvallur, pearly shade snake, australia, rare mutation snake, slaty-grey snake, nocturnal snake, territory wild life officials

A white snake was discovered in Australia with an "incredibly rare mutation" that left its skin a brilliant, pearly shade.

శ్వేతనాగు విషయంలో క్లారిటీ ఇచ్చిన అధికారులు

Posted: 08/01/2017 01:25 PM IST
White snake with incredibly rare mutation discovered in australia

తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా కేంద్రంలో నాగుల చవితి రోజున శ్వేతనాగు లభించడంతో భక్తులు పూజలు చేసిన వైనాన్ని మనం మర్చిపోకముందు మరో అరుదైన శ్వేత వర్ణంలోని పాము అస్ట్రేలియాలో ప్రత్యక్షమైంది. అస్ట్రేలియాలోని ఓ పట్టణంలో నివసిస్తున్న స్థానికురాలు ఈ అరుదైన శ్వేతవర్ణంలోని పామును చూసింది. ముత్యంలా మెరుస్తూన్న ఈ పాము అక్కడి వారిని విపరీతంగా అకర్షించింది. అయితే రంగంలోకి దిగిన వన్యప్రాణి సంరక్షణ అధికారులు దానిని తీసుకుని స్తానికంగా గల పార్కులోకి తీసుకువచ్చి పరిశోధన మొదలుపెట్టారు.

ముత్యంలా మెరిసిపోతున్న ఈ పామును చూస్తే ఎవరైనా శ్వేతనాగు అనుకుంటారని అయితే ఇది నిజానికి శ్వేత నాగు కాదని అధికారులు తేల్చిచెప్పారు. ఇది ఆస్ట్రేలియాలో నివసించే సాల్టీ గ్రే స్నేక్‌ అని చెప్పారు. సాధారణంగా ముదురు గోధుమరంగులో ఉండే ఈ పాములు అరుదైన జన్యు లోపాల కారణంగా శ్వేతవర్ణంలోకి మారిందని, అంతేకానీ ఇది శ్వేత నాగు కానేకాదని టెర్రిటరి వైల్డ్‌లైఫ్‌ పార్కు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పాములు విషపూరితమైనవి కావని కూడా చెబుతున్నారు.

అయితే ఈ పాము శ్వేతవర్ణంలోకి మారడానికి కేవలం జన్యు లోపాలే కారణం కానీ ఏదో పాడురోగం వచ్చిందని భావించలేమని కూడా చెబుతున్నారు. ఈ పాముకు నిజంగా ఏదైనా రోగం వస్తే దాని కళ్లు గులాభి వర్ణంలోకి మారుతాయని కానీ ఈ పాము కళ్లు నలుపు రంగులో ఉన్నాయని చెప్పారు అధికారులు. శునకం దీన్ని తినబోతే రక్షించిన ఓ స్థానికుడు తమకు అప్పగించాడని తెలిపారు. అయితే ఇటీవల గుండీలోని చిల్డ్రెన్ పార్కులో లభించిన పాము కూడా అస్టేలియాలో లభించి సాల్టీ గ్రే స్నేక్ కేనా అన్న అనుమానాలు వ్యక్తం మవుతున్నాయి. మన అధికారులు చెప్పినట్లు.. ఈ పాముది తమ దేశం కాదుని... అసలు ఈ ఖండమే కాదనడంతో అనుమానాలు బలపడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cobras  white cobra  rare snakes  guindy  tiruvallur  slaty-grey snake  australia  

Other Articles