టీఎస్ పీఎస్పీ వదంతులపై క్లారిటీ | TSPSC Candidates Don't believe That Rumors

Tspsc urges students not to believe cancellation rumours

TSPSC, TSPSC Rumours, TSPSC Exams, TSPSC Notification Cancel Rumours, TSPSC Denied Rumours, TSPSC Gurukul Exams, TSPSC New Notifications, TSPSC 2017 Notifications, Telangana Public Service Commission Rumours, TSPSC Allegations

The Telangana State Public Service Commission (TSPSC) on Wednesday asked candidates to not believe rumors that it had cancelled notifications for recruitment of various posts in the residential educational institutions societies. The Commission in a press release said that it had only postponed various examinations for Gurukul posts from July 21 to August 3 in compliance with interim stay orders of the Hyderabad High Court.

టీఎస్ పీఎస్పీ రద్దు... అంతా రూమర్లేనా?

Posted: 07/27/2017 08:29 AM IST
Tspsc urges students not to believe cancellation rumours

ఇప్పటికే అక్రమ భర్తీలంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఆదేశాలానుసారం పరీక్షలను వాయిదా వేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ). అయితే ఏకంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు రద్దయ్యాయంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దంటూ ఓ ప్రకటనలో టీఎస్ పీఎస్సీ విజ్ఞప్తి చేసింది. గురుకుల పరీక్షలపై కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉందని, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో పరీక్షలు వాయిదా వేశామే తప్పా, రద్దు చేయలేదని స్పష్టం చేసింది.

కాగా, బాలికలు, మహిళా విద్యా సంస్థల్లో పోస్టులన్నీ మహిళా అభ్యర్థులతోనే భర్తీ చేయాలన్న జీవో నం 1274 ను హైకోర్టు నిలిపి వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురుకుల విద్యాలయాల్లో ఉపాధ్యాయ, లెక్చర్ పోస్టులతో పాటు వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీ నిమిత్తం టీఎస్ పీఎస్సీ ఈ నెల 21 నుంచి ఆగష్టు 3 వరకు నిర్వహించాలనుకుని కోర్టు తీర్పు నేపథ్యంలో వాయిదా వేసింది. 15 నోటిఫికేషన్లకు సంబంధించి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ కాలేజీలకు సంబంధించిన ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లతోసహా ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లు, గురుకుల పాఠశాలల్లోని లైబ్రేరియన్లు, స్టాఫ్‌నర్సులు, పీఈటీల పరీక్షలను వాయిదా వేసినట్టు చెప్పారు. న్యాయస్థానం తదుపరి తీర్పును అనుసరించి ఈ నియామక ప్రక్రియను చేపట్టనుంది. గ్రూప్-1 మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ)ల నిలుపుదలకు ఉమ్మడి హైకోర్టు నిరాకరించటంతో, 24 నుంచి ఆగస్టు 10 వరకు అవి జరుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSPSC  Gurukul Posts  Rumours  

Other Articles