Former President Get Honoured with Theme Song

Kalam memorial all set to launch

APJ Abdul Kalam, Kalam Second Death Anniversary, Kalam Anthem Song, Kalam Salaam Telugu Song,Kalam Song, Kalam Salaam Telugu, Kalam Theme New record, Abdul Kalam Memorial Launch, Kalam Salaam Modi, Modi Kalam Memorial Launch

About 50 million students from across the country will sing the ‘Kalam anthem’ Kalam Salaam, when Prime Minister Narendra Modi cuts the ribbon to inaugurate the grand memorial of late President APJ Abdul Kalam at his tomb here on Thursday marking the second anniversary of the great patriot’s demise.

మాజీ రాష్ట్రపతికి అరుదైన గౌరవం

Posted: 07/26/2017 12:01 PM IST
Kalam memorial all set to launch

రాజకీయాలకు రాష్ట్రపతి భవన్ వేదిక కావొద్దన్న ఏకైక ఉద్దేశ్యంతో ప్రథమ పౌరుడిగా తన వంతు విధిని సక్రమంగా నిర్వహించి, రెండో దఫా అవకాశం వచ్చినా కూడా తృణప్రాయంగా వదిలేసుకున్నాడు ఏపీజే అబ్దుల్ కలాం. శాస్త్రవేత్తగా అంతకు మించి ఆదర్శప్రాయుడిగా దేశం మన్ననలు అందుకున్న ఆయన రెండో వర్థంతి రేపు (జూలై 27). ఈ సందర్భంగా ఆయన స్వస్థలం రామేశ్వరంలో స్మారక భవనం(మెమోరియల్) ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. పాట కోసం క్లిక్ చేయండి

తొలిదశలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ రేపు (గురువారం) రామేశ్వరంలోని ఆయన సమాధి వద్ద ఏర్పాటు చేసిన గ్రాండ్ మెమోరియల్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సలాం కలాం పేరిట ఓ పాటను 5 కోట్ల మంది విద్యార్థులతో పాడించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ‘కలాం సలాం’ అనే గీతాన్ని తమిళంలో గీత రచయిత వైరముత్తు రాయగా సిద్ శ్రీరామ్ పాడారు. ఈ పాట తమిళ్ వర్షన్ ను ఇప్పటికే ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ విడుదల చేశారు.

మ్యూజిక్ డైరక్టర్ గిబ్రన్ కంపోజ్ చేయగా, వసంత్ సాయి వీడియో దర్శకత్వం వహించారు. తెలుగులో సింగింగ్ లెజెండ్ బాలసుబ్రహ్మణ్యం, హిందీలో ప్రసూన్ జోషి పాడారు. ఒకేసారి అంతటా విద్యార్థులతో ఈ పాటను పాడించటం ద్వారా కొత్త రికార్డును నెలకొల్పే ఆలోచనలో ఉన్నారు. కలాం గ్రాండ్ మెమోరియల్ ప్రారంభోత్సవం అనంతరం మోదీ ‘సందేశ్ వాహిని విజన్-2020’ రథయాత్రను ప్రారంభించనున్నారు. రామేశ్వరంలో ప్రారంభయ్యే ఈ రథయాత్ర అక్టోబరు 15న కలాం జయంతి(86వ) సందర్భంగా రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటుంది. రెండో దశ మెమోరియల్ మరో రెండేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : APJ Abdul Kalam  Death Anniversary  Kalam Memorial  Kalam Salaam  

Other Articles