AP DGP warns none to respond to mudragada padyatra ముద్రగడ పాదయాత్రపై టెన్షన్.. టెన్షన్..

Ap dgp warns of extreme consequences those participate in mudragada padyatra

mudragada padayatra, tension in amaravathi, mudragada chalo amaravati call, kapu caste leader mudragada padmanabham, AP DGP, N. Sambasiva Rao, warning, kapu leader, mudragada padmanabham, chalo amaravathi, padyatra, chandrababu, election promise

AP DGP N. Sambasiva Rao warns of Extreme consequences, for those responds and participates in kapu leader mudragada chalo amaravathi padyatra

ముద్రగడ పాదయాత్రపై టెన్షన్.. టెన్షన్.. డీజీపీ వార్నింగ్

Posted: 07/25/2017 05:10 PM IST
Ap dgp warns of extreme consequences those participate in mudragada padyatra

కావులకు రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ తో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన చలో అమరావతి పాదయాత్రకు అనుమతి లేదని.. ఈ క్రమంలో చట్టాన్ని అతిక్రమించి పాదయాత్రలో పాల్గోనే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్ర కోసం ఎలాంటి అనుమతి తీసుకోలేదని తెలిపారు. పాదయాత్రలో ఎవరు పాల్గొనకూడదని ఆయన సూచించారు. పాదయాత్ర పేరుతోనో.. మరో పేరుతోనో ప్రభత్వ అస్తులు, ప్రైవేటు అస్తులపై విధ్వంసానికి పాల్పడితే చట్టపరంగా పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

డీజీపీ మంగళవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏదైనా ర్యాలీ చేయాలంటే పోలీసు అధికారుల పర్మిషన్ తీసుకోవాలని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా బాధ్యత తీసుకుంటామని ఒకరు హామీ ఇస్తేనే పర్మిషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు 2009లో ప్రతి రాష్ట్రానికి గైడ్ లైన్స్ జారీ చేసిందని తెలిపారు. అమరావతి పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 30, సెక్షన్ 144 లు అమల్లో ఉన్నాయని, నిబంధనలు అతిక్రమించి పాదయాత్రలో పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ముద్రగడ పాదయాత్రకు భయపడేది లేదని, అలాగే వెనకడుగు వేసేది లేదన్నారు.

కాపు నేతలు గతంలోనూ విధ్వంసాలకు పాల్పడ్డారని, గత ఏడాది ముద్రగడ పాదయాత్రలోనూ 60 నుంచి 70 కోట్ల రూపాయల అస్తులకు నష్టం వాటిల్లిందని అన్నారు. ఈ క్రమంలో ఎవరైనా ఆస్తులు ధ్వంసం చేస్తే కేసులు పెడతామని ఆయన స్పష్టం చేశారు. సంఘ విద్రోహశక్తులు పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే చూస్తూ ఊరుకోమని డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. చట్టం పట్ల గౌరవం లేకుంటే అందరికీ నష్టం జరుగుతుందన్నారు.

మరోవైపు ముద్రగడ పాదయాత్ర దృష్ట్యా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో.. సచివాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. వెంకటపాలెం, మందడం గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎటువంటి ర్యాలీలు, ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయినా ముద్రగడ ఇచ్చిన పిలుపుకు స్పందించి కాపులు రాజధాని అమరావతికి చేరకుంటారన్న టెన్షన్ మాత్రం పోలీసు అధికారుల్లో కనిపిస్తుంది. దీంతో రాజధానికి చేరుకునే అన్ని మార్గాలను దిగ్భంధం చేశారు. ఎన్నికలకు ముందు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ హామీని నెరవేర్చాలని ముద్రగడ పాదయాత్రకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles