'India’s Best-Loved Politician', opines US magazine సుష్మాస్వరాజ్ పై అమెరీకన్ పత్రిక ప్రశంసల జల్లు

India s best loved politician opines us magazine

indias best loved politician, US magazine editorial on sushma swaraj, sushma swaraj response to pleas, varadarajan, Pakistani citizens medical attention, Sushma Swaraj, Ministry of External Affair, MEA, India’s Best-Loved Politician, Twitter Sushma

An editorial piece in The Wall Street Journal called Indian Minister of External Affairs Sushma Swaraj "India’s Best-Loved Politician" in the world’s biggest democracy.

అమ్మ ప్రేమను చాటుతున్న భారతీయుల చిన్నమ్మ..!

Posted: 07/25/2017 03:59 PM IST
India s best loved politician opines us magazine

అమె అసాధారణ నాయకురాలు. బీజేపిలోని ఎందరో మహిళా నేతలు వున్నా.. కేంద్ర మంత్రి పదవులలో కొనసాగుతున్నా.. వారందరినీ ఈమెతో పోల్చలేము. అనారోగ్యం బారిన పడినా.. అమె తన మంత్రిత్వ శాఖకు చెందిన సేవలకు మాత్రం అంతరాయం కలగకుండా జాగ్రత్తపడుతూ.. ఎప్పటికప్పుడు బాధితుల పక్షాన నిలిచి వారికి ఆపన్నహస్తం అందించారు. అమె మరోవరో కాదు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్షను పార్లమెంటులో వినిపించి.. తెలంగాణ ప్రజల మనస్సులను కొల్లగొట్టిన చిన్నమ్మ. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పెద్దమ్మ సోనియాతో పాటు ఆ ప్రాంత ప్రజల వాంఛపై గొంతును వినిపించిన ఈ చిన్నమ్మను కూడా మర్చిపోవద్దని అమె చేసిన అభ్యర్థనతో అమెను తెలంగాణ ప్రజల గుండెల్లో దాచుకున్నారు.

ఆయితే ఆ తరువాత మారిన రాజకీయ సమీకరణలో ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరడంతో.. 2014 నుంచి అమె భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తూ కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే అమె అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అందరి మన్నన్నలు పోందుతూ అత్యుత్తమంగా ఆరాధిస్తున్న రాజకీయ నేతగా అవతరించారని ఏకంగా అమెరికాకు చెందిన ది వాల్ స్ట్రీట్ పత్రిక ఎడిటోరియల్ వ్యాసాన్ని ప్రచురిస్తూ అభివర్ణించింది. యావత్ దేశంలోనే అమె మేటి రాజకీయ నేతగా కొనియాడింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు అమె నిజంగా తన మాతృత్వ ప్రేమను చాటుతున్నారని అభివర్ణించింది. దీంతో సుస్మా స్వరాజ్ కు అత్యంత అరుదైన గౌరవం దక్కింది.

ఇబ్బందుల్లో చిక్కకున్న భారతీయుల కోసం అమె అహర్నిశలు కష్టపడుతున్నారని, అదే అమెను మేటి నాయకురాలిగా అవతరించేందుకు దోహదం చేశాయన్నారు. సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ఖాతాను 8.69 మిలియన్ల మంది ఫాలో అవుతన్నారని.. అమె ఇప్పటి వరకు చేసిన ట్విట్లలో అనేకం బాధితులు అమెకు అర్థిస్తూ చేస్తున్న వాటికి సమాధానంగా చేసినవేనని వ్యాసం పేర్కోనింది. హోవర్ విశ్వవిద్యాలయానికి చెందిన స్టాండ్ ఫర్డ్ ఫెలోషిఫ్ వున్న టుంకూ వరదరాజన్‌ అనే వ్యాసాకర్త తన వ్యాసంలో మరెన్నో విషయాలను పేర్కోన్నారు.

ధాయాధి దేశం పాకిస్థాన్ తో నిత్యం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నా.. అమె మాత్రం తన మాతృత్వపు మమకారాన్ని చాటుతూ అపదలో వున్నాము కరుణించండీ అన్న పాకిస్తానీయులకు కూడా అపన్నహస్తాన్ని అందిస్తున్నారని పలు సంఘటలనలలో అమె చేసిన ట్విట్లతో పాటు భాధితులుతమదేవానికి తిరిగివెళ్లిన తరువాత చేసిన ట్విట్లను కూడా పొందపర్చుతూ ఇలాంటి నేతలు అత్యంత అరుదుగా వుంటారని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles