college student who got girlfriend raped to avoid marriage స్నేహితులతో ప్రేయసిపై గ్యాంగ్ రేప్..

College student who got girlfriend raped to avoid marriage arrested

lover gangraped by boyfriend and two, jalandhar gang rape, teen gangraped in jalandhar, Harpreet Singh Happy, Bindu, Ravi, rape, gangrape, Jalandhar rape, love affair, lover conspiracy with friends, classmates, lover, crime

The victim told the police that Harpreet and she were in the same class in college and had decided to get married after a long courtship. “On July 20, he called me and said he wanted to introduce me to his parents,” she told the police.

స్నేహితులతో ప్రేయసిపై ప్రియుడి గ్యాంగ్ రేప్..

Posted: 07/25/2017 02:08 PM IST
College student who got girlfriend raped to avoid marriage arrested

పంజాబ్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని అన్ని విధాలుగా వాడుకుని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ నయవంచకుడు.. అమె పదే పదే వెంటపడి తనను పెళ్లి చేసుకోవాలని మాట తీసుకుంటూరావడంతో.. అమెను వదిలించుకునేందుకు కుట్ర పన్ని మరీ దారుణానికి ఒడిగట్టాడు. అమెను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేని ఆమె ప్రియుడు తన ఇద్దరి స్నేహితులతో తన ప్రియురాలిపై సాముహిక అత్యాచారం చేయించాడు. ఈ ఘటన జలంధర్‌లోని తల్వాణ్ గ్రామంలో చోటుచేసుకుంది.

తల్వాణ్ గ్రామానికి చెందిన హర్ప్రీత్‌ సింగ్‌ హ్యాపీ(19) అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి గత కొద్దీరోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే సుదీర్ఘకాలం తర్వాత పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. జులై 20 న బాధితురాలని తల్లితండ్రులకు పరిచయం చేస్తానని తెలిపిన నిందితుడు. అదే రాత్రి 10.30 గంటలకు ఆమె ఇంటి నుంచి బైక్‌పై ఎక్కించుకొని  దారి మధ్యలో అతని మిత్రులు బిందు, రవిల బైక్‌ ఎక్కించాడు. తన తల్లిదండ్రులను తీసుకొస్తానని ఆమెకు మాయ మాలలు చెప్పి వెళ్లిపోయాడు. వారిద్దరూ బాధితురాలని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అమెపై  అత్యాచారం జరిపారు. అనంతరం అమెను ఓ గదికి తీసుకెళ్లి అక్కడ కూడా అమెపై మరోమారు అత్యచారానికి పాల్పడ్డారు.

దీంతో షాక్ గురైన బాధితురాలు తేరుకుని ఇంటి్కి వెళ్లి జరిగిన ఘటనను తల్లిదండ్రులకు వివరించింది. వారిని వెంటబెట్టుకుని జలందర్ పోలీసు స్టేషన్ కు చేరుకుని జరిగిన ఘటనను పోలీసులకు పిర్యాదు చేసింది. కుట్రదారుడు హర్ప్రీత్ సింగ్ ను జలంధర్ పోలీసలు అదుపులోకి తీసుకొన్నారు. అతనితో పాటు స్నేహితులపై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులు ముగ్గురు ఒకే గ్రామానికి చెందిన వారని, బాధితురాలి క్లాస్ మెట్స్‌ అని పోలీసులు తెలిపారు. బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం అస్పత్రికి తరలించామని చెప్పిన పోలీసులు.. నిందితుడు హ్యాపీని కోర్టులో హాజపర్చామని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gangrape  Jalandhar rape  love affair  classmates  lover  crime  

Other Articles