charmi approches high court in drugs case హైకోర్టుకు నటి ఛార్మీ.. వెసులుబాటు కల్పించాలట..

Charmi approches high court in drugs case

charmi approches high court, charmi high court, charmi drugs case, charmi on drugs case, charmi in drugs case, Actress, Charmi, High court, Drugs, Lawyer, Akun sabarwal, SIT Notices, crime

south indian actress charmi approches High Court in drugs case, files writ petition pleading to allow advocate for Inquiry

హైకోర్టుకు నటి చార్మీ.. వెసులుబాటు కల్పించాలట..

Posted: 07/24/2017 12:26 PM IST
Charmi approches high court in drugs case

తెలుగు సినీ పరిశ్రమకు చెందని అనేక మందిని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు.. వాటితో లింకులున్న వారందిరిలో వణుకుపుట్టిస్తుంది. కాగా ఈ కేసులో నోటీసులు అందుకున్న నటి చార్మి ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. డ్రగ్స్ కేసులో రక్త నమూనాల సేకరణ సరికాదని హైకోర్టులో అమె రిట్ పిటీషన్ దాఖలు చేసింది. విచారణ తీరు సరిగా లేదని చార్మి ఆరోపించింది. అర్టికల్ 20 సబ్ క్లాప్ ప్రకారం రక్త నమూనాలను బలవంతంగా సేకరిస్తున్నారని చార్మి పిటిషన్ లో పేర్కొంది.

అంతేకాకుండా విచారణకు తాము న్యాయవాదిని తీసుకెళ్లే వెసలుబాటు కల్పించాలని కోరింది. కాగా చార్మీ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం చంద్రవదన్, అకున్ సబర్వాల్, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ , సూపరింటెండెంట్లకు నోటీసులు జారీ చేసిన రాష్ట్రోన్నత న్యాయస్థానం మంగళవారం ఈ పిటీషన్ పై విచారించనుంది. ఈ కేసుకు సంబంధించి సినీనటి చార్మిని ఈ నెల 26వ తేదీన ఎక్సైజ్ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) విచారించనుంది.

ఈ మేరకు ఆమెకు ఇప్పటికే అధికారుల నోటీసులు అందించడంతో పాటు మీడియాకు ద్వారా కూడా ఎవరెవరిని ఎప్పుడెప్పుకు విచారిస్తున్నామన్న సమాచారాన్ని తెలిపారు. మరోవైపు  చార్మికి డ్రగ్స్ మీద దృష్టిపెట్టేంత తీరిక, సమయం లేదని ఆమె తండ్రి దీప్ సింగ్ అన్నారు. అనవసరంగా ఆమెను ఈ కేసులోకి లాగారని మండిపడ్డారు. కాగా దర్శకుడు పూరీ జగన్నాథ్ ‌కు కూడా ఈ కేసుతో ఎలాంటి సంబంధం ఉండదని, ఆయన ముత్యం లాంటి వాడని దీప్ సింగ్ కితాబిచ్చారు.

బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్న ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్‌ విచారణపై సందిగ్ధం వీడింది. ఆమెను ఈ నెల 27న విచారించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అమె బిగ్ బాస్ కార్యక్రమ నిర్వాహకుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న అధికారులు.. ఆమెను 27న సిట్ ఎదుట హాజరు కావాలని చెప్పారు. అయితే ఎవరు ఎలా స్పందిస్తున్నా.. తమ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress  Charmi  High court  Drugs  Lawyer  Akun sabarwal  SIT Notices  crime  

Other Articles