ఫేపులు చూసి కోపంతో భార్యను చంపాడు | Chappatis Not in Shape Man Kills Wife

Man kills wife as her chappatis not round

Chappatis Kills, Chappatis Murder, Husband Kills Wife Chappatis, Chappatis Shape kills Wife, Chappatis Not Round Murder, Jahangirpuri Murder, pregnant Wife Killed Delhi

A 22-year-old pregnant woman Simran was murdered by her husband as she couldn't make him perfectly round chappatis. The incident occurred in northwest Delhi's Jahangirpuri on Saturday night but it came to light early Sunday morning. Around 4am, the victim's brother called up the police and told them that his sister was lying unconscious in her flat while her four-year-old daughter was locked up in a room. Husband in absconding.

షేప్ లో లేవంటూ భార్యను చంపేశాడు

Posted: 07/24/2017 10:35 AM IST
Man kills wife as her chappatis not round

కారణాలు చిన్న చిన్నవే అయినా వైవాహిక బంధంలో అవి పెడుతున్న చిచ్చు అంతా ఇంతా కాదు. కేవలం భార్య చేసిన చపాతీలు గుండ్రంగా లేవని ఆగ్రహించి గర్భిణీ అని కూడా చూడకుండా దుర్మార్గానికి పాల్పడడ్డాడు ఓ భర్త. ఢిల్లీలోని జహంగిర్‌పురిలో ఈ ఘటన శనివారం చోటుచేసుకోగా కాస్త ఆలస్యంగా విషయం వెలుగుచూసుంది.

ఏడాది ప్రేమించుకున్న ఆ జంట ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల పాప ఉంది. వ్యాపారంలో నష్టం రావటంతో, ఓ ఫ్యాక్టరీలో పని చేసుకుంటున్నాడు ఆ వ్యక్తి. ఆ అసహనాన్ని తన భార్య సిమ్రాన్ మీద తరచూ చూపిస్తూ వచ్చేవాడు. చపాతీలు కూడా సరిగ్గా చేయటం రాదంటూ కొట్టేవాడని ఆ చిన్నారి చెబుతోందీ కూడా. శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో చపాతీల విషయంలో భార్యాభర్తలు మరోమారు గొడవపడ్డారు. సిమ్రన్‌పై భర్త దాడిచేశాడు. తండ్రిని అడ్డుకోవడానికి కుమార్తె ప్రయత్నించగా ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి బయట గొళ్లెం పెట్టాడు.

సిమ్రాన్ ఫోన్ ఎంతకీ తీయకపోవటంతో అనుమానం వచ్చిన ఆమె సోదరుడు ఇంటికెళ్లి చూశాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న సోదరిని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. ఆపై ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Husband  Chappatis  Murder  

Other Articles