ఉడిపి రావు కన్నుమూత.. మోదీ ట్వీట్ | Man behind India's First Satellite Dies

Eminent space scientist ur rao passes away

Udupi Ramachandra Rao , UR Rao, Aryabhata Satellite Scientist, Former ISRO Chairman Died, UR Rao Died, UR Rao Modi, ISRO Former Chairman Died, Indian Satellite King, Udupi Rao Died

Former ISRO chief Udupi Ramachandra Rao dies at 85. UR Rao, former ISRO chairman, was responsible for the launch if India's first satellite Aryabhata.

ఇండియన్ శాటిలైట్ కింగ్ కన్నుమూత

Posted: 07/24/2017 09:30 AM IST
Eminent space scientist ur rao passes away

దేశం తరపున ప్రయోగించబడిన తొలి ఉపగ్రహం ఆర్యభట్ట వెనుక ఉన్న మేధావి, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మాజీ చీఫ్ ప్రొఫెసర్ యూఆర్ రావు (85) ఇకలేడు.  బెంగళూరు లో సోమవారం వేకువఝామున 3గంటలకు ఆయన కన్నుమూసినట్లు ఇస్రో పీఆర్ డీ దేవీప్రసాద్ కర్నిక్ మీడియాకు వెల్లడించాడు. 85 ఏళ్ల రావు గత కొంత కాలంగా హృద్యోగ(గుండె) సమస్యతో బాధపడుతున్నాడు.

ఉడిపిలోని అదంపూర్‌లో జన్మించాడు ఉడిపి రామచంద్రరావు అలియాస్ యూఆర్ రావు. ఆర్యభట్ట నుంచి మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రాజెక్టు వరకు ఆయన పనిచేశారు. ఇస్రో చైర్మన్‌గా పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టారు. ముఖ్యంగా 1984-94 మధ్య ఆయన సేవలు చాలా కీలకంగా మారాయి. 2013 లో వాషింగ్టన్ లో నిర్వహించిన శాటిలైట్ హాల్ హాఫ్ ఫేమ్ లో ఆయన పేరు నమోదు చేశారు. భారత దేశ తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగంలో ఆయనే ముఖ్యభూమిక పోషించాడు. చంద్రయాన్-1, మంగళయాన్ లకు కూడా ఆయన సలహాలు అందిస్తూ వస్తున్నారు.

రావు గతంలో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబరేటొరీ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా, తిరువనంతపురంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాన్స్‌లర్‌గానూ సేవలందించారు. అంతేకాదు, పలు ఉన్నత పదవులు నిర్వహించారు. విదేశీ యూనివర్శిటీల్లోనూ ఆయన పనిచేశారు. పది అంతర్జాతీయ అవార్డులు, మరెన్నో జాతీయ అవార్డులు అందుకున్నారు. 1976 లో ఆయనకు పద్మభూషణ రాగా, ఈ జనవరిలో రావుకు ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించింది. అయితే ఆ గౌరవాన్ని తాను మరణానంతరం అందుకుంటానని ఆయన చెప్పడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISRO  UR Rao  Aryabhata Satellite  

Other Articles