Parvinder Awana attacked in Greater Noida నోయిడాలో క్రికెటర్ పై దాడి.. కారు ధ్వంసం

Kings xi punjab and delhi pacer parvinder awana assaulted in noida

Parwinder awana, Kings xi punjab parwinder awana, parwinder awana attacked, parwider awana india, mohammed shami india, mohammed shami attacked, cricketer, Parwinder awana, Kings xi punjab, noida, assault, latest news

Delhi pacer Parvinder Awana was assaulted by five people in Greater Noida. The incident happened and police has begun an investigation.

నోయిడాలో క్రికెటర్ పై దాడి.. కారు ధ్వంసం

Posted: 07/22/2017 05:30 PM IST
Kings xi punjab and delhi pacer parvinder awana assaulted in noida

దేశంలో క్రీడాకారులకు భద్రత కరువైంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కొల్ కతాలో టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీపై కొందరు అగంతకులు జరిపిన దాడిని మర్చిపోకముందే. మరో  క్రికెటర్ పర్వీందర్ అవానపై గ్రేటర్‌ నోయిడాలో దాడి జరిగిడం కలకలం రేపింది. ఓ యువ‌తి స‌హా ఐదురుగు వ్యక్తులు ఆయ‌న‌పై దాడికి దిగి, ఆయ‌న కారును ధ్వంసం చేసి పారిపోయారు. జరిగిన ఘటనపై షాక్ నుంచి తేరుకున్న పర్వీందర్ పోలీసులకు సమాచారం అందించారు.

టీమిండియా తరఫున 2012లో ఇంగ్లాండ్‌పై రెండు టీ20లు ఆడిన పర్విందర్.. ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జ‌ట్టు తరపున కూడా అడారు. పర్విందర్ పిర్యాదును అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనకు  సంబంధించి తెలుసుకున్నారు. పర్వీందర్ పై దాడికి పాల్పడిన ఆ ఐదుగురు అంతకుముందు ఓ ఐస్‌ ఫ్యాక్టరీ వద్ద కొంతమందితో గొడ‌వ ప‌డ్డార‌ని తేల్చారు. అనంత‌రం వారు రోడ్డు మార్గంలో వెళుతుండ‌గా అదే ప్రాంతం గుండా క్రికెట‌ర్ ప‌ర్వీంద‌ర్‌ కారు వారిని దాటుకుంటూ వెళ్లిపోంది.

దీంతో ఆ కారు తమతో గొడవపడిన వ్య‌క్తుల‌దే అని భ్ర‌మ‌ప‌డిన ఆ దుండ‌గులు కారుని అడ్డుకుని స‌ద‌రు క్రికెట‌ర్ పై దాడికి దిగారని పోలీసులు గుర్తించారు. ఆ దుండ‌గులు గ్రేటర్ నోయిడాలోని గంగోలా గ్రామానికి చెందిన వారని పోలీసులు చెప్పారు. అయితే వారు కేవలం తమతో గోడవకు దిగిన వారే అని పోరబడి క్రికెటర్ పర్విందర్ పై దాడికి దిగారని అన్నారు. కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగుతోందని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricketer  Parwinder awana  Kings xi punjab  noida  assault  latest news  

Other Articles