New 8% Pension Scheme, PMVVY, Launched వయోవృధ్దులకు కేంద్రం కొత్త పెన్షన్ పథకం..

Pmvvy new 8 pension scheme for senior citizens

Pradhan Mantri Vaya Vandana Yojana, new pesion scheme for senior citizens, PMVVY, new pension scheme, 8% pension scheme, senior citizens, LIC

Financial planners say that this pension scheme will offer more avenues to senior citizens to earn steady regular income at a time of falling interest rates.

వయోవృధ్దులకు కేంద్రం కొత్త పెన్షన్ పథకం..

Posted: 07/22/2017 04:51 PM IST
Pmvvy new 8 pension scheme for senior citizens

వయోవృద్ధులకు కేంద్రం వందనం చేస్తుంది. అవునండీ నిజంగా.. జీవిత చరమాంకంలో వారు అర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా వుండేందుకు వయో వందన పేరుతో కొత్త పెన్షన్ పథకాన్ని కేవలం సీనియర్ సిటిజన్ల కోసం మాత్రమే ప్రవేవపెట్టింది. ఈ పెన్షన్ పథకాన్ని ఎల్‌ఐసీ అమలుచేస్తోంది. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో దీన్ని తీసుకోవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పదేళ్ల పాటు 8 శాతం వడ్డీ చెల్లింపులకు హామీ ఉంటుంది.

ఈ పథకంలో చేరిన వయోవృద్దులకు నెలకు కనీసం రూ.1,000 పెన్షన్ కావాలంటే రూ.1.5 లక్షలు, గరిష్ఠంగా రూ.5,000 పెన్షన్ కావాలంటే రూ.7.5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. 60ఏళ్లు నిండిన ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఏడాది మే 4న ప్రారంభమైన ఈ పెన్షన్ పథకంలో వచ్చే ఏడాది మే 3వ తేదీ వరకు చేరవచ్చు. ఇతర ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే వయె వందనం పథకం మీద ఏటా 8.3 శాతం వడ్డీ గిట్టుబాటవుతుంది.

ఈ పథకం కింద సీనియర్‌ సిటిజన్లు నెల, 3 నెలలు, 6 నెలలు లేదా ఏడాదికి ఒకసారి పెన్షన్ అందుకోవచ్చు. పథకంలో చేరేటపుడే ఈ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఈ పథకానికి జీఎస్టీ వర్తించదు. పథకంలో చేరిన మూడేళ్ల తర్వాత పెట్టిన పెట్టుబడిలో 75 శాతం మొత్తాన్ని రుణంగా తీసుకోవచ్చు. పదేళ్ల కాలపరిమితి మధ్యలోనే పెన్షనర్ లేదా వారి జీవిత భాగస్వామి తీవ్రమైన వ్యాధుల బారిన పడితే పెట్టిన పెట్టుబడిలో 98 శాతం తిరిగి చెల్లిస్తారు. పదేళ్ల కాలం పూర్తిగా ముగిసిపోయి… అప్పటివరకు అసలు మొత్తం లోంచి ఏమీ తీసుకోకపోతే ముందుగా ఎంత మొత్తం పెట్టి కొనుగోలు చేశారో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PMVVY  new pension scheme  8% pension scheme  senior citizens  LIC  

Other Articles