Not enough stock of ammunition to fight 10 day war: CAG ఆందోళన రేపుతున్న కాగ్ నివేదిక.. యుద్దం వస్తే..

Indian army s ammunition stock will exhaust after 10 days of war cag report

Indian Army, Army ammunition supply, ammunition shortfall, CAG report, war supply, Comptroller and Auditor General, Army vice chief, Comptroller and Auditor General, Army Ammunition, Ordnance Factory Board, india, indian army, ammunation

The Compliance Report of the Comptroller and Auditor General (CAG) has revealed that the stockholding of around 40 percent types of ammunition for armed forces is not enough to fight even 10 days of war.

ఆందోళన రేపుతున్న కాగ్ నివేదిక.. యుద్దం వస్తే..

Posted: 07/22/2017 01:56 PM IST
Indian army s ammunition stock will exhaust after 10 days of war cag report

కాంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్ ‌(కాగ్‌) తాజాగా వెలువరించిన విషయాలు దేశ ప్రజల్లో అందోళనను రేకెతిస్తుంది. ఓ వైపు పోరుగుదేశం తన ఆర్మీని సమాయత్తం చేస్తూ సరిహద్దులో పొంచివుండి యుద్దం తప్పదన్న సంకేతాలను జారీ చేస్తున్న తరుణంలో కాగ్ ఇచ్చిన నివేదిక వెలువరించడంపై కూడా వివాదాస్పదం అవుతుంది. మనదేశం మీదకు ఏ దేశమైనా దండెత్తితే పది రోజులకు మించి పోరాడే ఆయుధ సంపత్తి మన వద్ద లేదని కాగ్ తన రిపోర్టులో పేర్కొంది.

అయితే ఇటువంటి కీలక సమయాల్లో ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేసి.. వాటిపై చర్యలు తీసుకునేలా సూచనలు చేయాల్సిన సందర్భంలో ఏకంగా దేశ రక్షణ శాఖకు సంబంధించిన కీలక సమాచారన్ని బట్టబయలు చేసి ప్రత్యర్థి దేశాలకు ఈ సమాచారం అందేలా నివేదికను బహిర్గం పర్చడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కాగ్ తన నివేదికలను పార్లమెంటుకు సమర్పించడం అనవాయితి. అయితే దేశభద్రతకు సంబంధించిన అంశంలో కూడా ఇలాంటి అనవాయితీనే అచరించడం అందోళన రేకెత్తుతుంది. అసలు కాగ్ బయటపెట్టిన అంశాలేంటో తెలుసా..?

దేశ రక్షణకు ఎంతో అవసరమైన యుద్ధ సామగ్రిని..  పెద్ద మొత్తంలో సమకూర్చుకోలేక పోతున్నామని.. గత మూడేళ్ల క్రితం 2013లో వున్న స్థాయి నిల్వలకు.. 2016 నిల్వలకు పెద్ద తేడా ఏమీ లేదని స్పష్టం చేసింది. అయితే గత మూడేళ్లుగా యుద్ద సామాగ్రి ఉత్పత్తికి కేంద్రం అంత ప్రాధాన్యత ఇవ్వలేదా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాధారణంగా చిన్న యుద్దం జరిగినా.. దేశం 20 రోజుల వరకు సరిపడా సామాగ్రిని సమకూర్చుకోవడం అన్ని దేశాలు పాటించే పద్దతి. అయితే ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే అత్యవసరమయ్యే 55 శాతం సామగ్రి అందుబాటులో లేదని కాగ్ చెప్పింది.

అయినా అందుబాటులో ఉన్న 40 శాతం యుద్ధ సామగ్రి కూడా పది రోజుల పాటు యుద్ధం జరిగితే అయిపోతుందని తెలిపింది. ముఖ్యంగా ఆర్టిలరీ గన్స్‌, ట్యాంక్ లకు అవసరమయ్యే యుద్ధ సామగ్రి కొరత తీవ్రంగా ఉందని చెప్పింది. 2013లో పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడం అర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు విఫలమైందని విమర్శించింది. అయితే అప్పటి నుంచి ఏం జరిగింది..? ఎందుకని వార్షిక లక్ష్యాలను సమకూర్చుకోలేదన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. కానీ చైనాతో డోక్లోమా వద్ద గత వారం రోజులుకు పైగా నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఈ వివరాలు పార్లమెంటు ముందుకు రావడం అందోళనరేకెత్తిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles