BSNL introduces PRATIBHA Plan for students విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ సరికొత్త బంఫర్ ఆఫర్

Bsnl introduces pratibha plan for students with 180 days validity

BSNL Pratibha Plan, BSNL students plan, bsnl pratibha plan for students, bsnl students pratibha plan, bsnl plan for telugu students, PRATIBHA, BSNL, Students, Telangana, Andhra Pradesh, Unlimited calls, SMS, 3GB data, Validity

Bharat Sanchar Nigam Limited (BSNL) has introduced a Promotional Prepaid Plan for students of Andhra Pradesh & Telengana circle, which available from july 15.

విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ సరికొత్త బంఫర్ ఆఫర్

Posted: 07/21/2017 03:31 PM IST
Bsnl introduces pratibha plan for students with 180 days validity

తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ సంస్థ సరికొత్త ఆఫర్ తో సరికొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రతిభ పేరుతో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ముందుకు వచ్చిన ఈ పథకంలో నీట్, ఎంసెట్ సహా ఇతర పరీక్షలలో అర్హత సాధించిన విద్యార్థులు.. వారి ర్యాంక్ కార్డు అధారంగా ప్రతిభ ప్రీ పెయిడ్ పథకంలో చేరే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ఆఫర్ ఈ నెల 15 నుంచి 90 రోజుల పాటు కొనసాగనుంది. అయితే విద్యార్థులు తమ వ్యాలిడిటీని పెంచుకోవాలని బావించిన పక్షంలో కేవలం రూ. 49 తో రీచార్జ్ చేస్తే 180 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.

విద్యర్థులు మైనర్లన పక్షంలో వారి తల్లిదండ్రులు పేరుపై ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. అందుకు తల్లిదండ్రుల గుర్తింపు, అడ్రస్ ఫ్రూఫ్ లను తీసుకోనున్నారు. దీంతో వీరికి ఏదేని ఒక మొబైల్ నెంబరుతో లేదా ల్యాండ్ లైన్ నెంబరుకు అన్ లిమిటెడ్ టాక్ టైమ్ కల్పించనున్నారు. ఈ పథకంలో చేరగానే విద్యార్థులకు రూ 20 ఉచిత టాక్ టైమ్ లభిస్తుంది. దీంతో పాటు సెకనుకు పైసా కాల్ పల్స్ రేట్ చోప్పున వీరు ఏ మొబైల్ కైనా కాల్ చేసుకునే వెసలు బాటు కల్పిస్తున్నారు.

దఅంతేకాకుండా 3 జీబి డాటా కూడా లభిస్తుంది. ఇక ఈ డేటా కూడా నెల రోజుల వ్యాలీడిటీతో లభ్యం కానుంది. వీటితో పాటు విద్యార్థులు లోక్ల్, నేషనల్ ఎస్ఎంఎస్ లు పంపుకునేందుకు గాను నెలకు 300 ఎస్ఎంఎస్ లు ఉచితంగా పంపే సదుపాయం కూడా కల్పించింది బీఎస్ఎన్ఎల్. కాగా ఈ పథకంలోకి ఇతర బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు చేరే వెసలుబాటును మాత్రం కల్పించలేదు. అయితే ఉచిత అన్ లిమిటెడ్ కాల్ చేసుకునే నెంబరును మార్చుకున్న పక్షంలో మాత్రం రూ.10 చార్జీగా వసూలు చేస్తామని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. మరిన్ని వివరాలకు 1503, 18001801503 టోల్‌ఫ్రీ నెంబర్‌ను సంప్రదించవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PRATIBHA  BSNL  Students  Telangana  Andhra Pradesh  Unlimited calls  SMS  3GB data  Validity  

Other Articles