పాత నోట్లు నేరం అయితే వెంకన్న పరిస్థితి? | Devotee moves SC to Accept Venkanna's Old Notes

Plea to accept old tirupati notes

TTD, TTD Old Notes, TTD Old Notes, TTD Supreme Court, TTD Old Notes Supreme Court, SC TTD Old Notes, Supreme Court TTD Notes, Tirupati Old Notes, TTD Hundis Old Notes, VV Ramanmurthy TTD

PIL seeks Supreme Court diktat to RBI on TTD's old notes. Due to this, Rs 8.29 crores worth demonetised notes Rs 500 and Rs 1000 notes were packed and kept in boxes with the TTD,” he claimed.

పాతనోట్లు ఉంటే ఆయన్ను లోపలేస్తారా?

Posted: 07/21/2017 11:04 AM IST
Plea to accept old tirupati notes

పాత నోట్ల మార్పిడికి మరో ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసేసింది. అయితే పెద్ద ఎత్తున్న వచ్చిన విజ్నప్తులతో(మిత్రపక్షాల ఒత్తిడి ఉందని ఓ టాక్) మేరకు ఎన్నారైలు, జిల్లా సహకార బ్యాంకులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. దీంతో టీటీడీకి ఓ ఛాన్స్ ఇవ్వాలంటూ భక్తుడొకరు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాడు.

తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ఉన్న సుమారు రూ. 8.29 కోట్ల రద్దయిన పాత నోట్ల మొత్తాన్ని మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ వీవీ రమణమూర్తి అనే ఓ జర్నలిస్ట్ పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషనర్ తరపున శ్రవణ్ కుమార్ అనే న్యాయవాది ఆసక్తికర వాదన వినిపించాడు. రద్దయిన రూ. 1000, రూ. 500 నోట్ల మార్పిడికి వాళ్లకు ఛాన్స్ ఇచ్చి, టీటీడీకి ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొన్నాడు. ఈ నోట్లను అనుమతించకపోవడం వల్ల స్వామివారు భక్తులు సమర్పించిన కానుకలను అందుకోకుండా తిరస్కరించినట్టు అవుతుందని, తద్వారా వారి కోరికలు కూడా నెరవేరకపోతాయన్న భావనలో ఉండిపోతారని తెలిపారు. భక్తితో సమర్పించే కానుకలు స్వామివారికి, అభివృద్ధి పనులకు, భక్తుల సేవలకు వినియోగం కాకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు.

రద్దయిన నోట్లు ఎవరి వద్దనైనా ఉంటే అది నేరమని కేంద్రం చెబుతోందని, అలాగని పాత నోట్లు ఉన్నందుకు వెంకటేశ్వర స్వామిని జైలుకు పంపుతారా? లేక టీటీడీని పంపుతారా? అంటూ ప్రశ్నించాడు. టీటీడీ హుండీలు ప్రధాన ప్రాంతాల్లో ఒకటి, రెండు రోజులకోసారి లెక్కించినప్పటికీ, మిగతా ప్రాంతాల్లో మాత్రం ఆరు నెలలకోసారి లెక్కిస్తారు. అందుకే వాటిని అనుకున్న సమయానికి టీటీడీ మార్చుకోలేకపోయిందని తెలిపాడు. కాగా, తదుపరి వాదనల నిమిత్తం కేసు విచారణ వాయిదా పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TTD  Old Notes  Demonetisation  Supreme Court  

Other Articles