Airlines cannot ban anyone, says kurien ట్రావెల్ బ్యాన్ పై పీజే కురియన్ సంచలన వ్యాఖ్యలు

Rajya sabha deputy chairman sensational comments on travel ban

Rajya Sabha, Deputy Chairman PJ Kurien, PJ Kurien, Flying ban, Samajwadi Party, Naresh Agarwal, Telugu Desam Party, JC Diwakar Reddy, Diwakar Reddy flying ban, Ravindra Gaikwad, travel ban, air lines, aviation ministry

Rajya Sabha Deputy Chairman PJ Kurien said that airlines have no authority to impose flying ban on anyone, including parliamentarians, adding that the law of the land should take its course.

ట్రావెల్ బ్యాన్ పై పీజే కురియన్ సంచలన వ్యాఖ్యలు

Posted: 07/20/2017 06:58 PM IST
Rajya sabha deputy chairman sensational comments on travel ban

దేశంలోని విమానయాన సంస్థలకు దేశ పౌరులపై ట్రావెల్ బ్యాన్ విధించే అంశమై రాజ్యసభ ఢిప్యూటీ చైర్మన్ పీజే కురియర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సభ్యులపై లేక దేశంలోని సామాన్య పౌరులపై కానీ విమానయాన సంస్థలకు ఎట్టి అధికారం లేదని కుండబద్దలు కొట్టారు. వివిమానంలోగానీ, విమానాశ్రయాలలో గానీ నిబంధనలు అతిక్రమించిన పౌరులపై విమానయాన నిషేధాన్ని విధించే అధికారం సదరు విమానాయాన సంస్థకు లేదని కురియన్‌ అన్నారు. చట్టప్రతినిధులు కూడా సాధారణ పౌరులతో సమానమని చెబుతూనే.. వారికి విమానయాన ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

కాగా, ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటారే తప్ప వారిపై నిషేధం విధించడానికి వీల్లేదని అన్నారు. ఇవాళ రాజ్యసభలో ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ ఈ విషయంపై చర్చను లేవనెత్తారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పలు దేశీయ విమానాల్లో ప్రయాణించే సందర్భాల్లో ఉల్లంఘనకు, హింసకు పాల్పడుతున్నారనే కారణంతో ఎయిర్ ఇండియా సహా పలు ప్రైవేటు విమానాయాన సంస్థలు తమపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయని అన్నారు. అసలు విమానయాన సంస్థలకు ప్రయాణికులపై ట్రావెల్ బ్యాన్ విధించే అధికారం వుందా..? అని అయన ప్రశ్నించారు.

దీనికి స్పందించిన కురియన్‌.. అగర్వాల్‌ చాలా విలువైన పాయింట్‌ లేవనెత్తారని, వాస్తవానికి ఎయిర్‌ ఇండియా సహా ఏదేని ప్రైవేటు విమానయాన సంస్థకు ప్రయాణికులపై నిషేధాన్ని విధించే అధికారం అన్నారు. విమానయాన సంస్థలకు ఎవరినీ శిక్షించే అధికారం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కూడా ఆయన సూచించారు. చట్టసభల సభ్యులైనా లేక సాధారణ ప్రయాణికులైనా వారి నిబంధనలను అతిక్రమిసస్తే చట్టం అతినిపై చర్యలు తీసుకుంటుందే కానీ.. విమానయాన సంస్థలు కాదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajya Sabha  PJ Kurien  Naresh Agrawal  travel ban  air lines  aviation ministry  

Other Articles