another drug rocket busted in hyderabad banjara hills పోలీసుల అదుపులో మరో డ్రగ్స్ రాకెట్ ముఠా..

Another drug rocket busted in hyderabad banjara hills

nigerians, student visa, goa, darknet, south africa, drugs rocket, gang arrest, Task force police, banjara hills, hyderabad, crime

Aanother drug rocket busted in hyderabad banjara hills, in which two foreigners from nigeria who came to india on student visa along with 7 locals arrested.

పోలీసుల అదుపులో మరో డ్రగ్స్ రాకెట్ ముఠా..

Posted: 07/19/2017 08:05 PM IST
Another drug rocket busted in hyderabad banjara hills

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్‌ వ్యవహారం ఓ వైపు సినీ పరిశ్రమలో పెను కలకలం రేపుతున్న తరుణంలో.. మరో డ్రగ్స్ ముఠా కూడా ఎక్సైజ్ శాఖ టాస్క్ పోర్స్ పోలీసులకు చిక్కింది. ఇప్పటికే కెల్విన్ ను అదుపులోకి తీసుకుని అతను వెల్లడించిన సమాచారంతో లోతుగా అధ్యయనం చేసే పనిని భుజాలపే వేసుకుని ఈ మత్తు పధార్థాలను ఎవరెవరు.. తీసుకుంటున్నారా.. వారికి సరుకు ఎలా అందుతుందన్న కొణంలో దర్యాప్తు చేస్తూ. నోటీసులు కూడా అందించిన ఆబ్కారీ శాఖ వారిని ఇవాళ్టి నుంచే విచారిస్తుండగా,  మరో డ్రగ్స్ ముఠా కూడా పోలీసులకు చిక్కింది.

ఈ ముఠాలో ఇద్దరు నైజీరియన్లు సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 300 గ్రాముల కొకైన్‌, 42 గ్రాముల ఎండీఎంఏ, 27 ఎల్ఎస్డీ యూనిట్లు, కారు, ఎయిర్ గన్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్టోఫర్‌ అనే యువకుడు.. విద్యార్థి వీసాపై వచ్చి గోవాను కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ దందా నడుపుతున్నాడని టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి మీడియాకు తెలిపారు. అక్కడి నుంచి ఆన్ లైన్ ద్వారా డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారని వివరించారు.

డ్రగ్స్ కేసును మరింత లోతుగా విచారించాల్సి ఉందన్నారు. అయితే, ఇప్పటికే అరెస్టయిన కెల్విన్ ముఠాతో వీరికి ఎలాంటి సంబంధాలు లేవని తెలిపారు. వీరంతా వేరే ముఠాగా ఏర్పడి డ్రగ్స్ దందాను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ ముఠాలో మల్లికార్జున్‌ అనే వ్యక్తి బీటెక్‌ చేసి ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా పనిచేశాడు. డార్క్ నెట్ నుంచి మూడుసార్లు జర్మనీ నుంచి కొకైన్‌, ఎల్ఎస్డీ తెప్పించినట్టు తెలిపారు. అలాగే మహేందర్ అనే మరో వ్యక్తి కూడా డార్క్ నెట్ లోనే చూసి డ్రగ్స్ ను కొనుగోలు చేసి సప్లై చేశాడన్నారు. వీరందరిపైనా పీడీ చట్టం ప్రయోగించే ప్రతిపాదనను పెట్టనున్నట్టు డీసీపీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles