Venkaiah Naidu NDA's Vice President candidate అఫీషియల్: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య

Venkaiah naidu is nda s candidate for vice president

Venkaiah Naidu, NDA candidate, Vice President, BJP, Congress, Vice Presidential poll, Gopalkrishna Gandhi, opposition parties candidate, venkaiah vice president, BJP parliamentary board's meet, amit shah, narendra modi, pm modi

Information and Broadcasting Minister M Venkaiah Naidu is ruling NDA's candidate for Vice Presidential poll against opposition parties candidate gopal krishna gandhi.

అఫీషియల్: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య

Posted: 07/17/2017 07:31 PM IST
Venkaiah naidu is nda s candidate for vice president

నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా దక్షిణాది నుంచి ఎదిగిన బీజేపి నేత వెంకయ్య నాయుడు పేరును ఎట్టకేలకు బీజేపి ఖారారు చేసింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి రేసులో ముందునుంచి టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న ఆయన పేరును ఇవాళ సాయంత్రం భేటీ అయిన బీజేపి పార్లమెంటరీ కమిటీ సభ్యుల సమావేశంలో ఖారారు చేశారు. ఈ విషయాన్ిన బీజేపి జాతీయ అధ్యక్షడు అమిత్ షా సార్లమెంటరీ కమిటీ భేటీ తరువాత అధికారికంగా ప్రకటించారు.

దీంతో రేపు అనగా మంగళవారం రోజు మధ్యాహ్నం వెంకయ్యనాయుడు ఈ పదవికి నామినేషన్ ధాఖలు చేయనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఈ పదవికి వెంకయ్యనాయుడు వైపే మొగ్గు చూపినట్లు అమిత్ షా తెలిపారు. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్న పార్టీ ఉప రాష్ట్రపతి పదవికి ఆయనను అర్హుడిగా భావించిందని అమిత్ షా తెలిపారు. వెంకయ్య పేరును పార్లమెంటరీ కమిటీ బోర్డు ఏకగ్రీవంగా అమోదించిందని తెలిపారు.

ఉపరాష్ట్రపతి రేసులో వున్న వెంకయ్యకు ఉదయం నుంచే ప్రముఖ నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఇవాళ పార్లమెంటు సమావేశాల ప్రారంభం నేపథ్యంలో హాజరైన వెంకయ్యనాయుడికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, జేడీయూ అధినేత శరద్ యాదవ్, వామపక్ష నేత రాజా, కాంగ్రెస్ నేత ఆజాద్ లు వెంకయ్యకు అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ,  రాజ్యసభను వెంకయ్య అయితే హుందాగా నడిపిస్తారని అన్నారు. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ, రాజ్యసభలో సింహాన్ని చూస్తారంటూ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkaiah Naidu  NDA candidate  Vice President  BJP  Congress  Vice Presidential poll  

Other Articles