sasikala effect: IPS D.Roopa transferred శశికళ ఎఫెక్ట్: జైలు అధికారుల బదిలీ

Roopa transferred in aftermath of prison irregularities report

vip treatment to sasikala, sasikala parappana agrahara jail, D Roopa Moudgil, VK Sasikala, Bengaluru Jail, AIADMK, Parappana Agrahara Central Prison, satyanarayana, siddaramaiah, karnataka

Days after she set off a major controversy alleging that Sasikala is getting undue favours in the Parappana Agrahara Central Prison, IPS Officer Roopa Moudgil was transferred by the Karnataka government.

ఐపీఎస్ ల బదిలీలు, శశికళతో పెట్టుకున్నందుకా..? లేక..

Posted: 07/17/2017 02:33 PM IST
Roopa transferred in aftermath of prison irregularities report

తమిళనాడు ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళతో పెట్టుకున్న ప్రభావం.. ఆ ఐపీఎస్ అధికారులకు కనిపించింది. ఏకంగా తాము విధులు నిర్వహిస్తున్న శాఖలను కాకుండా వారిని ఇతర శాఖలకు బదిలీ అయ్యేలా చేసింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శశికళకు రాజభోగాలు అందుతున్నాయని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన ఐపీఎస్‌ అధికారిణి రూపా మౌద్గిల్ తో పాటు రెండు రోట్లు రూపాయలను తీసుకున్నారన్న అరోపణలు ఎదుర్కొంటున్న జైళ్ల శాఖ ఏడీజీపి సత్యనారాయణపై కూడా బదిలీ వేటు పడింది.

కర్ణాటక కారాగార డీఐజీ నుంచి ఆమెను ట్రాఫిక్‌ డిపార్టుమెంటుకు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీచేసింది. కొందరు జైలు అధికారులు శశికళ వద్ద రూ.2కోట్లు ముడుపులు తీసుకొని ఆమె కోసం ప్రత్యేకమైన వంటగది, పరుపులు, సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లు డీఐజీ రూపా ఉన్నతాధికారులకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. దాంతో అవినీతి, అక్రమాలపై సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని పత్రికలకు చేరవేశారన్న అరోపణలపై రూపాపై చర్యలు తీసుకునే అంశాన్ని కూడా కర్ణాటక ప్రభుత్వం పరిశీలిస్తుంది.

sasikala roopa

అమె చేసిన ఆరోపణలపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వం నుంచి ఆమె శ్రీముఖాలు అందుకున్న నేపథ్యంలోనే.. అమెతో పాటు హెచ్ ఎన్ సత్యనారాయణలపై కూడా బదిలీ వేటు వేసింది కర్ణాటక ప్రభత్వం. ప్రభుత్వం నిర్దేశించిన అధికారులు మినహా ఇతరులకు ఈ తరహా సమాచారాన్ని నేరుగా అందించడం క్రమశిక్షణ ఉల్లంఘించినట్లేనని అందులో పేర్కొన్నారు. అయితే.. తానేమీ నిబంధనలను ఉల్లంఘించలేదని రూపా అంటున్నారు. వీరితో పాటుగా మొత్తం నలుగురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ.. ఉత్తర్వులను జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని కూడా పేర్కొంది. కాగా శశికళతో పెట్టుకున్నందుకే అమెపై చర్యలు తీసుకున్నారా..? లేక ప్రభుత్వం నిబంధనలను ఉల్లఘించినందుకే అమెపై వేటు వేశారా..? అన్న విషయాలపై మాత్రం భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles