Modi, Manmohan's foreign trips denied as 'vague' ప్రధాని ఆ లెక్కల గుట్టు మాత్రం విప్పరట..

Modi manmohan s foreign trips denied as vague

prime ministers' office, Prime Minister Narendra Modi, PMO, RTI, Narendra Modi, Manmohan Singh, Foreign Trips, foreing trip expenses, PM Modi, narendra modi, Nutan Thakur

The Prime Minister’s Office (PMO) has denied information on various expenses incurred in foreign trips by Prime Minister Narendra Modi and his predecessor Manmohan Singh, terming the query “vague”, an RTI activist said.

ప్రధాని ఆ లెక్కల గుట్టు మాత్రం విప్పరట..

Posted: 07/15/2017 04:22 PM IST
Modi manmohan s foreign trips denied as vague

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన దేశంలో కన్నా అధికంగా విదేశాల్లోనే పర్యటిస్తున్నారన్న మొదట్లో అరోపించిన కాంగ్రెస్ తాజాగా అయన చేసే పర్యటలతో దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని కూడా అరోపణలు గుప్పించింది. తాజాగా ప్రధాని విదేశీయానాలన్నీ దేశ ప్రజలకు టీవీల్లో చూపించడానికి తప్ప మరెందుకు ఉపయుక్తం కావడం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మకెన్ విమర్శించారు. ప్రధాని పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల వ్యవధిలో 64 విదేశీ పర్యటనలు చేశారని కూడా ఎద్దేవా చేశారు. ఈ పర్యటనలను దేశప్రజలకు చూపడంలో వున్న ఆసక్తి.. దేశానికి లాభం చేకూర్చే విషయంలో మాత్రం కానరాలేదని దుయ్యబట్టారు.

ఈ క్రమంలో ప్రధాని విదేశీ పర్యటనలపై ఓ సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటీషన్ ను ప్రధానమంత్రి కార్యాలయం నిద్వందంగా తోసిపుచ్చింది. ప్రధాని హోదాలో ఎవరు పర్యటనలు జరిపినా అవి దేశ సంక్షేమం కోసమేనని.. తెలిసో, లేక తెలియకో కానీ ఈ పిటీషన్ దాఖలైంది.  ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ల విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చుల వివరాలు ఇవ్వడం కుదరదని ప్రధాని కార్యాలయం తెలిపింది. కాగా వీరి విదేశీ పర్యటనల ఖర్చుల వివరాలు తెలియజేయాలని సామాజిక కార్యకర్త నూతన్ ఠాకూర్‌ సమాచార హక్కు చట్టం కింద గత జూన్ 16న దరఖాస్తు చేశారు.

అయితే ఈ పిటిషన్ అర్థం లేనిదని ప్రధానిల ఖర్చుల వివరాలు ఇవ్వలేమని పీఎంవో కేంద్ర సమాచార అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రధానుల పర్యటనల గురించి పీఎంఓ, ఇతర శాఖలను ఫైళ్ల కాపీలు ఇవ్వాల్సిందిగా కోరానన్నారు. ఆర్టీఐ సెక్షన్ 19 ప్రకారం సౌత్ బ్లాక్ లో ఉన్న అప్పిలేట్ అథారిటీ సయ్యద్ ఇక్రం రిజ్విని సంప్రదించాల్సిందిగా ప్రవీణ్ కుమార్ సూచించారని నూతన్‌ ఠాకూర్‌ మీడియాకు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PMO  RTI  Narendra Modi  Manmohan Singh  foreing trip  expenses  PM Modi  Nutan Thakur  

Other Articles

 • Air india express to launch flight connecting dubai to vijaywada

  గన్నవరం నుంచి తొలి అంతర్జాతీయ విమానం.. ఎక్కడికో తెలుసా.?

  Jan 18 | రాజధాని లేని రాష్ట్రంగా సరిగ్గా మూడున్నరేళ్ల క్రితం నిలిచిన నవ్యాంద్రప్రదేశ్ అభివృద్దిలో శరవేగంగా దూసుకుపోతుంది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసి ఏకంగా సచివాలయం, అసెంబ్లీలను కూడా తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించుకున్న రాష్ట్రం..... Read more

 • Pravin togadia alleges pm modi conspiring with police to harass him

  ప్రధాని మోడీపై ప్రవీణ్ తొగాడియా సంచలన అరోపణలు

  Jan 18 | విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన ఆరోపణలు గుప్పించారు. తనకు వ్యతిరేకంగా మోదీ కుట్రలకు పాల్పడుతున్నారని, తన గొంతును మౌనంగా వుంచేందుకు ఈ విధమైన... Read more

 • Cji dipak misra meets four senior most supreme court judges

  పరిష్కారం దిశగా.. ఆ నలుగురితో సీజేఐ భేటీ..

  Jan 18 | సుప్రీంకోర్టు పరిపాలన సజావుగా లేకపోవడంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి చేరిందంటూ బహిరంగంగా ప్రకటించిన నలుగురు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ కురియన్... Read more

 • All cabs and buses have to install gps panic buttons by apr 1

  లైంగికదాడుల నివారణ చర్యలపై దృష్టిసారించిన కేంద్రం..

  Jan 18 | దేశంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు అధికమౌతున్న క్రమంలో వాటిని అరికట్టేందుకు తొలివిడతగా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ముందుగా రోడ్డు రావాణ మార్గంలో మహిళా ప్రయాణికుల భద్రత కోసం... Read more

 • Dancers arrested in east godavari for obscene dances

  యువకుల నడుమ.. అర్థనగ్న నృత్యాలు..

  Jan 18 | తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరుపుకున్నారు. అయితే ఇంకా పలు ప్రాంతాల్లోని యువత మాత్రం ఈ సంబరాల జోష్ నుంచి పక్కకు తప్పుకోలేకపోతుంది. దీంతో యువతను అట్రాక్ట్ చేసేందుకు కొందరు... Read more

Today on Telugu Wishesh