Video of Sasikala's Kitchen in Jail deleted రూపా అధారం మిస్.. మళ్లీ సొంతశాఖే దోషి..

Video of sasikala s kitchen in jail deleted

VK Sasikala, sasikala kitchen video, ips d roopa, AIADMK, Bengaluru jail, Karnataka, DG Prisons, Roopa Moudgil, Exclusive kitchen, Sasikala jail bribe, Sasikala Bengaluru jail kitchen, D Roopa, Sasikala, Big News, Bengaluru Jail, AIADMK, siddaramaiah, karnataka

Deputy Director General (Prisons) D Roopa exposed the VIP Treatment offered to AIADMK chief VK Sasikala Natarajan in Parappana Agrahara Central Jail.

రూపా అధారం మిస్.. మళ్లీ సొంతశాఖే దోషి..

Posted: 07/15/2017 11:23 AM IST
Video of sasikala s kitchen in jail deleted

బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారన్న అంశాలను వెలుగులోకి తీసుకురావడంతో దేశవ్యాప్తంగా వున్న పలువురు మహిళా పోలీసు అధికారులు, నెట్ జనులు, మహిళల నుంచి అమెకు మద్దతు లభిస్తుంది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన అంశాలను అమె ధైర్యంగా వెలుగులోకి తీసుకురావడంపై పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మాజీ ఐపీఎస్ అధికారిణి పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ కూడా సోషల్ మీడియాలో డిఐజీ రూపను అభినందించారు.

ఎవ్వరికీ భయపడకుండా ధైర్యంగా నిజాలు భయటపెట్టినందుకు సాటి మహిళగా గర్వపడుతున్నానని బేడీ అన్నారు. దేశంలోని మహిళా అధికారులందరూ ఇలాగే ధైర్యంగా విధులు నిర్వహించాలని కోరుకుంటున్నానని తెలిపారు. కిరణ్ బేడీ వ్యాఖ్యలకు డీఐజీ రూప స్పందించారు.  సోషల్ మీడియాలో కిరణ్ బేడీకి ధన్యవాదాలు తెలిపారు. కిరణ్ బేడీ అభినందించడంతో తనకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు ఉందని తెలుపుతూ రూప సోషల్ మీడియాలో కిరణ్ బేడికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలావుండగా, శశికళ ప్రత్యేక వంటగదికి సంబంధించిన వీడియోను తమ శాఖకు చెందిన అధికారులే డిలీట్ చేశారన్న వార్త కూడా ప్రస్తుతం బెంగుళూరు పోలీసు వర్గాల్లో కలకలం రేపుతుంది. శశికళకు రాచమర్యాదలు అందిస్తున్న విషయమై అటు కర్ఱాటక రాజకీయాల్లో ప్రకంపనలు చోటుచేసుకోగా, అందుకు సంబంధించి ఈ అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి విచారణకు కూడా అదేశించారు. అయితే తన వద్ద శశికళ వంటగదికి సంబంధించిన అధారాలు వున్నాయని చెప్పుకోచ్చిన రూపా.. తాజాగా ప్లేటు ఫిరాయించారు.

తన సెల్ ఫోన్ లో కెమెరా కొంత ఇబ్బందిగా మారడంతో తాను ఇంటినుంచి హ్యాండీ కామ్ ను తీసుకువచ్చి.. దాంతోనే శశికళ వంటగదితో పాటు అమెకు కేటాయించిన ప్రత్యేక సౌకర్యాలను తన కెమెరాలో షూట్ చేశారనని, వాటిని ఓ పెన్ డ్రైవ్ లో పెట్టించి ఇవ్వాలని తన స్టాప్ ను అదేశించానని చెప్పారు. అయితే స్టాప్ తనకు హ్యాండీ కామ్ ఇచ్చిన తరువాత దానిని పరిశీలిస్తే.. అందులో శశికళకు సంబంధించిన వీడియో లేదని.. దానిని అధికారులే డిలీట్ చేశారని అమె అరోపిస్తున్నారు. దీంతో విచారణ కమిటీ ముందు అమె అధారాలను చూపలేరని, కేవలం వాదనలను మాత్రమే వినిపించగలరని స్పష్టమవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : D. Roopa  sasikala  Bengaluru  parappana agrahara jail  video  AIADMK  karnataka  

Other Articles

 • Pawan kalyan reveals real agnyaathavaasi behind the episode

  అజ్ఞాతవాసి గుట్టువిప్పిన పవన్, అభిమానులకు సూచనలు

  Apr 21 | టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గుట్టు వెనుకనున్న దుష్టచతుష్టయం వీళ్లేనంటూ క్రితం రోజున వరుస ట్విట్లతో బయటపెట్టిన పనవ్.. ఈ మొత్తం వ్యవహారం వెనుకనున్న అసలైన అజ్ఞాతవాసి ఎవరో తెలుసా అంటూ ట్విట్... Read more

 • Kathua gangrape murder case vaginal swabs match with accused confirms forensic lab

  కతువా కేసులో నిందితులు వీళ్లేనని తేల్చిన నివేదికలు

  Apr 21 | నిర్భయ ఘటన తరువాత దేశవ్యాప్తంగా కలకలం రేపిన అత్యాచారాలు బీజేపి ప్రభుత్వాలు అధికారంలో కొనసాగుతున్న ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్, జమ్మూలోని కథువా అత్యాచారాలని చెప్పనక్కర్లేని విషయం. కాగా ఉన్నావ్ లో బీజేపి ఎమ్మెల్యే... Read more

 • Raj tarun s father sentenced three years jail

  యువ హీరో రాజ్ తరణ్ తండ్రికి మూడేళ్ల జైలు

  Apr 21 | టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తండ్రి నిడమర్తి బసవరాజుకు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. విశాఖపట్నంలోని వేపగుంట ప్రాంతానికి చెందిన బసవరాజు (53) సింహాచలం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో... Read more

 • Pawan kalyan targets real agyanthavasi behind the episode

  న్యాయపోరాటానికి పవన్ రెడీ.. సంయమనం పాటించాలని పిలుపు

  Apr 21 | టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గుట్టు వెనుకనున్న దుష్టచతుష్టయం వీళ్లేనంటూ క్రితం రోజున వరుస ట్విట్లతో బయటపెట్టిన పనవ్..వీళ్లే తన తల్లిని  విమర్శించారని ఆరోపిస్తూ, ఫిల్మ్ చాంబర్ కు వచ్చి దీనిపై గట్టి... Read more

 • Diesel hits another all time high petrol prices at 55 month high

  జేబులు గుల్లా.. అల్ టైం హైకి డీజిల్.. రూ.80కి పెట్రోల్..

  Apr 20 | డీజిల్‌, పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. శుక్రవారం డీజిల్ ధర ఆల్ టైం గరిష్ఠానికి చేరింది. ఢిల్లీలో ఈరోజు లీటర్ డీజిల్ ధర రూ.65.31గా ఉంది. కోల్‌కతాలో రూ.68.01గా, ముంబయిలో రూ.69.54గా, చెన్నైలో... Read more

Today on Telugu Wishesh