Akun Sabharwal Not Goes On Leave

Akun sabharwal cancels his leave

Akun Sabharwal, Akun Sabharwal Leave, Akun Sabharwal Drug Case, Dug Case Probe, SIT Drug Case, Tollywood Celebrities Name, Akun Leave Cancel, Akun Sabharwal Real Hero, Prohibition Director (Enforcement) Telangana

Director of Drugs Control Administration Akun Sabharwal Cancels His Leave To Probe Dug Case. Prohibition Director (Enforcement) Akun Sabharwal has been given 'Hero' status after several celebrities names out. His Leaves creates Controversy after Political turn, then he cancels.

డ్రగ్స్ కేస్ ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన అధికారి

Posted: 07/15/2017 11:04 AM IST
Akun sabharwal cancels his leave

తాను సెలవుల మీద వెళ్తుండటంపై తీవ్ర ఆరోపణలు రావటంతో ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వెనక్కి తగ్గాడు. 10 రోజుల వ్యక్తిగత లీవ్ ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాడు. డ్రగ్స్ కేసు తీవ్రత దృష్ట్యా ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించాడు. దీంతో ఆయన నేతృత్వంలోనే విచారణ ముందకు సాగనుంది.

టాలీవుడ్ లో నెలకొన్న డ్రగ్స్ కల్చర్ పై ఉక్కుపాదం మోపి సెలబ్రిటీలు, బడా బాబుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తించిన అకున్ వ్యక్తిగత కారణాలతో సెలవులపై వెళ్లాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. నేటి నుంచి 25వ తేదీ వరకు 10 రోజుల పాటు అకున్ కు లీవ్ మంజూరైంది కూడా. అదే సమయంలో ఈ నెల 19 నుంచి 27 దాకా డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న సెలబ్రిటీలను ఒక్కోక్కరిగా విచారించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అకున్ సబర్వాల్ సెలవుపై వెళితే, ఆయన స్థానంలో ఈ కేసును ఎవరు డీల్ చేస్తారంటూ విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. దీంతో, కాస్త ఇబ్బందికి గురైన ప్రభుత్వం ఆయన సెలవును రద్దు చేసినట్టు సమాచారం.

డ్రగ్స్ విచారణ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో, సెలవులపై వెళ్లటం సబబు కాదని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించాడు. విచారణ పూర్తయ్యేంత వరకు ఆయన సెలవు వాయిదా వేసుకున్నాడు. కేసు నీరుగారిపోయే అవకాశం ఉందని ప్రజలు భావించే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కూడా ఆయన్ను కొనసాగాలని విజ్నప్తి చేసినట్లు తెలుస్తోంది.


కెల్విన్ లిస్ట్ లో ఎందరో...

పలువురు టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు జారీ కావడం, లిస్ట్ లో ఇంకా పొలిటికల్ లీడర్స్, బిజినెస్ మెన్ లు కూడా ఉన్నారంటూ లీకులు వస్తుండటం కలకలం రేపుతోంది. నోటీసులు అందిన వారు వ్యక్తిగతంగా విచారించనుంది సిట్. ఈ నేపథ్యంలో డ్రగ్స్ డీలర్ కెల్విన్ ను ఎక్సైజ్ సిట్ తమ కస్టడీలోకి తీసుకుంది.

చర్లపల్లి జైల్లో ఉన్న కెల్విన్ ను విచారణ నిమిత్తం సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో కెల్విన్ ప్రధాన నిందితుడు. రెండు రోజుల పాటు కెల్విన్ ను అధికారులు విచారించనున్నారు. కెల్విన్ ను విచారించే క్రమంలో టాలీవుడ్ లో డగ్స్ వినియోగంపై సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Drug Case  Akun Sabharwal  

Other Articles

 • Cabinet ministers should speak up like sc judges yashwant sinha

  వారికున్న అందోళన మీలోనూ వుంటే గొంతు విప్పండీ..!

  Jan 13 | కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై మరోమారు బీజేపి సీనియర్ నేత, మాజీ అర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా పరోక్ష విమర్శలు ఎక్కుపెట్టారు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు న్యాయమూర్తులను అదర్శంగా తీసుకుని కేంద్రంలోని క్యాబినెట్ మంత్రులు... Read more

 • Hyderabad police burst hitech prostitution racket

  హెటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు..

  Jan 13 | పండుగ వేళ ఎవరికి వారు సంబరాల్లో మునిగి తేలేందుకు సిద్దమవుతున్న క్రమంలో.. సందేట్లో సడేమియాలు మాత్రం తమ వ్యాపారాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకుంటున్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఎక్కడికక్కడ దాడులు... Read more

 • Court sentences two years jail term for mlc srinivas reddy

  ఎమ్మెల్సీకి రెండేళ్ల జైలు.. జరిమానా..

  Jan 13 | అధికారంలో వున్నవారైనా, విపక్షంలో వున్నవారైనా కేసులు పెట్టిన తరువాత మాత్రం చట్టం చట్రం నుంచి తప్పించుకోలేరు. ఎవరికీ చట్టం చుట్టం కాదు అని మరోమారు రుజువైంది. విధినిర్వహణలో ఉన్న సీఐపై దాడికి పాల్పడిన కేసులో... Read more

 • Hyderabadis went to native police security beeed up

  పల్లెకు నగరవాసి.. ముమ్మరమైన పోలీసు గస్తీ..

  Jan 13 | ఉదయాన్నే బోగి మంటలు, బందువులు, మిత్రులు, శ్రేయోభిలాషుల పలకరింపులు క్షేమసమాచారాలు ఆ తరువాత అభ్యంగన స్నానాలు.. ఇక ఊరూ వాడా అంత ఒక్క చోట చేరి సరదాగా అటలు అడుకునే సంప్రదాయకర పండుగ రోజును... Read more

 • Trs mla srinivas goud too travels in nayini way

  నాయిని బాటలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్..

  Jan 13 | తెలంగాణ రాకుమునుపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బండబూతులు తిట్టినోళ్లు.. తెలంగాణ అడ్డుకునేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించోనోళ్లు.. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించిన తరువాత అదే కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రులుగా కొనసాగుతున్నారని, సంచలన వ్యాఖ్యలు చేసిన... Read more

Today on Telugu Wishesh