అధికారికి ఎమ్మెల్యే బాబు మోహన్ బెదిరింపు! | MLA Babu Mohan Warn Official to remove job

Trs mla fire on panchayath officer

TRS MLA, TRS MLA Threat Official, Babu Mohan Threat Officer, Panchayat Raj Assistant Executive Engineer, Andole MLA Warn Officer, Andole TRS, Babu Mohan Fire Official, Babu Mohan Threatens, TRS MLA Threatens, TRS MLA Warn

TRS MLA Babu Mohan Threatens Panchayat Raj Assistant Executive Engineer over Road Construction. MLA Babu Mohan allotted funds to to construct on area but they did in another area.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కోపం వచ్చింది

Posted: 07/15/2017 10:22 AM IST
Trs mla fire on panchayath officer

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్యెల్యేల వ్యవహారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఫోన్ లలో బెదిరింపులు, ఈ మధ్య శంకర్ నాయక్ కలెక్టర్ ప్రీతి మీనా వ్యవహారం మరిచపోకముందే ఇప్పుడు మరో ఎమ్మెల్యే ఓ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసి వార్తల్లో నిలిచాడు. అది ఎవరో కాదు ప్రముఖ సినీ నటుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్.

తీవ్ర ఆగ్రహానికి లోనైన బాబు మోహన్ పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ పై చంద్రశేఖర్ పై విరుచుకుపడ్డాడు. రేగోడ్ మండలం కొండాపురం, జగిర్యాల, రేగోడ్ లలో శుక్రవారం జరిగిన హరితహారం కార్యక్రమానికి ఆయన హాజరయ్యాడు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ కాలనీకి సీసీ రోడ్లు లేకపోవటంతో ఆయనకు కోపం వచ్చేసింది. రోడ్డు ఎందుకు నిర్మించలేదంటూ పక్కనే ఉన్న అధికారులను ఆయన ఆరా తీశారు. దానికి సమాధానంగా రోడ్డును మరో చోట నిర్మించారనే సమాధానం వచ్చింది.

'అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేస్తే... నీ ఇష్టం వచ్చిన చోట పనులు చేయిస్తావా?' అంటూ ఏఈపై ఆయన నిప్పులు చెరిగాడు. 'ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నావ్? నీ ఉద్యోగం ఊడదీయించేస్తా' అంటూ హెచ్చరించాడు. దీనిపై అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పటికీ, తప్పు తమవైపు ఉండటంతో గప్ చుప్ అయిపోయారని తెలుస్తోంది. అభివృద్ధి విషయంలో మరోసారి ఇలాంటివి రిపీట్ చేయకండని వార్నింగ్ ఇచ్చి కార్యక్రమం ముగించుకుని ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

NOTE: We inform you that we are not owner of any of the products, images or any other products displaying on our website. But all the articles are written by us and we owned them. If you found any image or product that found under your copyrights then please feel free to CONTACT US. We will remove that image or product as soon as possible. All the images are collected from Google.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  MLA Babu Mohan  Panchayath Raj Officer  

Other Articles

Today on Telugu Wishesh