Babu Monday Polavaaram Jagan Friday Courtvaaram

Ganta comments on ys jagan padyatra

Minister Ganta, Jagan Courtvaaram, Ganta Jagan, Ganta Satires Jagan Padayatra, Minister Ganta Srinivas Rao, Babu Polavaaram Jagan Courtvaaram, Jagan Padayatra, Roja Minister Ayyana Patrudu, Chintakayala Ayyanna Patrudu

Minister Ganta Srinivas Rao Satires on YS Jagan Padayatra. Roja Drinks daily Liquor Minister Ayyanapatrudu Criticise.

జగన్ పాదయాత్ర బ్రేక్ గురించి గంటా

Posted: 07/15/2017 09:07 AM IST
Ganta comments on ys jagan padyatra

ప్లీనరీ వేదికగా నవరత్నాలను ప్రకటించిన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ వెంటనే అక్టోబర్ 27 నుంచి సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమైపోతున్న విషయం తెలిసిందే. అందరికి మంచి కాలం దగ్గర ఉందని చెబుతూ పనిలో పనిగా ముఖ్యమంత్రి కావాలనే బలమైన కోరికను మరోసారి ప్రకటించేశాడు. ఈ నేపథ్యంలో జగన్ పై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

తమ పార్టీ అధినేత చంద్రబాబుకు.. సోమవారం పోలవారం అయితే, జగన్ కు.. శుక్రవారం కోర్టువారం అని సెటైర్ వేశాడు. జగన్ తన పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ప్రతి శుక్రవారం విరామం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపాడు. ఎందుకంటే, అక్రమ కేసుల విచారణ విషయమై ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది కదా? అని తెలిపాడు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో ప్రభుత్వం, సీఎం పని చేస్తుంటే.. సహకరించాల్సింది పోయి పదే పదే విమర్శలతో పెద్ద తలనొప్పిగా తయారవుతున్నాడంటూ మండిపడ్డాడు.

పదహారు నెలల జైలు జీవితం గడిపిన జగన్ ఎలా నవ్వుతున్నాడో అర్థం కావడం లేదని టీడీపీకి చెందిన మరో నేత బండారు సత్యనారాయణ తెలిపాడు. జగన్ మనిషా? మానవమృగమా? అంటూ ఘాటుగా విమర్శించాడు. జగన్ సోదరి షర్మిల గురించి తాను మాట్లాడబోనని, తనకు చెల్లెలితో సమానమని, అంతగా కావాలంటే, యూట్యూబ్ లో వెతికితే ఆమె గురించిన సమాచారం దొరుకుతుందంటూ సెటైరిక్ గా విమర్శలు చేశాడు.

రోజానే తాగుబోతు...

వైసీపీ ఎమ్మెల్యే రోజా.. కేబినెట్ మంత్రులంతా తాగుబోతులని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డాడు. హాఫ్ బాటిల్ తాగితే తప్పా రోజాకు నిద్రపట్టదని, అలాంటి రోజా తమను విమర్శించటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించాడు. టీడీపీ నుంచి రోజా వెళ్లిపోయిన తరువాత తాము అధికారంలోకి వచ్చామని, వైసీపీలో రోజా ఉంటే .. జగన్ శాశ్వతంగా జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  Padayatra  Ganta Srinivas Rao  

Other Articles

 • Rahul calls it betrayal of anti communal mandate

  దమ్ముంటే జనంలోకి వెళ్ధాం రండీ.. యువనేత సవాల్..!

  Jul 27 | బీహార్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ ప్రజలు మతవాదులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినా.. ఆయన మరోమారు అధికారం కోసం వారి... Read more

 • Nitish kumar to swear in as bihar cm

  సీఎంగా నితీశ్.. డిప్యూటీ సీఎంగా మోదీ ప్రమాణం

  Jul 27 | మహా ఘటబంధన్ తో మైత్రి తెంచుకుని చివరకు మూడేళ్ల తర్వాత పాత దోస్తీ బీజేపీతో కలిసి బీహార్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది జనతాదళ్(యు). ఆరోసారి జేడీయూ నేత నితీశ్ కుమార్ కాసేపటి... Read more

 • China back step in doklam issue

  మనల్ని రెచ్చగొట్టేది చైనా కాదంట!

  Jul 27 | భూటాన్, సిక్కిం సరిహద్దుల్లో ఉన్న డోక్లాం చైనా సైన్యం యవ్వారంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. బాల్ భారత్ కోర్టులోనే ఉందంటూ.. చెబుతూనే మరో పక్క పలు విధాలుగా బెదిరించేందుకు చైనా ప్రయత్నించింది.... Read more

 • Gujarat floods kills 17 members of family

  ఒకే ఫ్యామిలీ.. 17 మంది దుర్మరణం

  Jul 27 | ఊహించని పరిణామం ఆ కుటుంబంలో కన్నీటిని మిగిల్చింది. గుజరాత్‌లో భారీ వర్షాలకు అక్కడి పరిస్థితి భీభత్సంగా ఉంది. వరదలు ముంచెత్తటంతో ఒకే కుటుంబానికి 17 మంది చనిపోయారు. చనిపోయిన వారు బనస్కంత జిల్లాకు చెందిందని,... Read more

 • Tspsc urges students not to believe cancellation rumours

  టీఎస్ పీఎస్పీ రద్దు... అంతా రూమర్లేనా?

  Jul 27 | ఇప్పటికే అక్రమ భర్తీలంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఆదేశాలానుసారం పరీక్షలను వాయిదా వేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ). అయితే ఏకంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు రద్దయ్యాయంటూ వస్తున్న వదంతులను... Read more

Today on Telugu Wishesh

porno