TTD Implement Drastic Changes in Divya Darshan

Ttd new changes in divya dharshan

TTD, Tirumala Darshanam, Divya Darshan, Tirumala Tirupati Devasthanam, Tirumala Tirupati Devasthanam Divya Darshan, Time Slab TTD, TTD New Rules, TTD Weekend Darshanam

The Tirumala Tirupati Devasthanams, which cancelled `Divya Darshan’ tokens on week-ends from July this year, has now decided to limit the issuance of tokens during the week days to 20,000.Divya Darshan tokens to 20,000 pilgrims

టీటీడీ కొత్త నిర్ణయం భక్తులకు ఇబ్బంది కాదా?

Posted: 07/14/2017 03:03 PM IST
Ttd new changes in divya dharshan

నడిచి వస్తున్న భక్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఆరేడు గంటలు పడుతుండటంతో వారాంతాల్లో దివ్యదర్శనాన్ని ఇప్పటికే రద్దు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కాలి నడక మార్గంలో ఎంత మంది భక్తులు వచ్చినప్పటికీ రోజుకు 20 వేల మందికి మాత్రమే దర్శన సమయాన్ని కేటాయించాలని నిర్ణయించింది.

ఈ మేరకు 17వ తేదీ సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు జేఈఓ శ్రీనివాసరాజు మీడియాకు తెలియజేశాడు. రోజుకు 20 వేల మందికి గరిష్ఠంగా దర్శనం లభించేలా చూస్తామని అన్నారు. ఇందుకోసం టైం స్లాట్ లను నిర్ణయిస్తామని, రెండున్నర గంటల్లో దర్శనానికి పంపుతామని వెల్లడించారు. వారంతంలో కాలిబాల దర్శనం రద్దు చేయటంతో ఆ మూడురోజుల్లో నడిచివచ్చిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శనం, లడ్డూ టోకెన్లు జారీ చేయరు.

ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు దివ్యదర్శనం టోకెన్ల జారీ నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. రూ.300 టికెట్ల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటకు 2500 మంది భక్తులకు కేటాయించి సజావుగా శ్రీవారి దర్శనం కేటాయిస్తున్నారు. అదే తరహాలోనే రోజులో 20వేల మంది కాలిబాట భక్తులకు టైం స్లాట్‌ కేటాయించనున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగటంతో అదుపు చేయటం కష్టతరమౌతోందని టీటీడీ భావిస్తూ వస్తోంది. ఉత్సవ వేళలో 50,000 మందికి పైగా, వారాంతంలో 40,000, మాములు రోజుల్లనూ 30000 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tirumala Tirupati Devasthanam  Divya Darshan  Devotees  

Other Articles