Highly Explosive Found in UP Assembly

Explosive found in up assembly mobiles banned

Uttar Pradesh Assembly, Terror Conspiracy, Assembly Bomb, Explosive Powder Assembly, MLA Seat Bomb, NIA Uttar Pradesh, UP Assembly Blast Plan, Assembly Blast Terrorists, UP Security Weak, Yogi Assembly Blast

Explosive found in Uttar Pradesh Assembly. Chief Minister Yogi Adityanath claims Terror Conspiracy and seeks NIA probe.

అసెంబ్లీలో బాంబు.. మొబైల్స్ బ్యాన్

Posted: 07/14/2017 01:00 PM IST
Explosive found in up assembly mobiles banned

అసెంబ్లీలో అది కూడా ఎమ్మెల్యే సీటు కిందే బాంబు లభించటంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య యోగినాథ్ స్పందించాడు.ఇది ముమ్మాటికీ ఉగ్ర కుట్రే అని ప్రకటించిన యోగి భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నాడని ఒప్పేసుకున్నాడు. దేశ అత్యున్నత ఉగ్రవాద నిర్మూలన విచారణ సంస్థ ఎన్ ఐఏ తో దర్యాప్తునకు ఆదేశించాడు. విద్రోహ చర్య వెనకాల ఉన్న నిందితులను కటకటాల వెనక్కి పంపాల్సిందేనంటూ పిలుపునిచ్చాడు.

యూపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు జరిగిన తనీఖీల్లో ఓ ఎమ్మెల్యే కుర్చీ కింద పౌడర్ లాంటి పదార్థం లభించింది. ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం పంపగా పెంటాఎరిత్రిటాల్ టెట్రానైట్రేట్ (పీఈటీఎన్) అనే శక్తివంతమైన ప్లాస్టిక్‌ పేలుడుపదార్థంగా గుర్తించారు. 60 గ్రాములే అయినప్పటికీ దాని ప్రభావం చాలా దారుణంగా ఉండేదని నివేదికలో వెల్లడైంది. దీంతో దేశంలోనే అతిపెద్ద అసెంబ్లీలో పేలుడుకు కుట్ర పన్నటంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు

ఇది 22 కోట్ల యూపీ ప్రజల సెంటిమెంట్ కు సంబంధించింది. కుట్ర వెనుక ఉందెవరో వెలుగులోకి తీసుకొస్తామని సీఎం యోగి ప్రకటించాడు. ఇకపై ప్రతినిధులతో మొబైల్ తో లోపలికి రావటం బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ప్రతీ గేట్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసి పాస్ లు ఉన్నవారినే లోపలికి అనుమతించాలని పేర్కొన్నాడు. అయితే అసెంబ్లీ పేలుడుకే కుట్ర జరిగిందంటే లా అండ్ ఆర్టర్ ఎంత దయనీయంగా ఉందోనంటూ సమాజ్ వాదీ పార్టీ విమర్శలకు దిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  Assembly  Explosive Found  

Other Articles

 • Cabinet ministers should speak up like sc judges yashwant sinha

  వారికున్న అందోళన మీలోనూ వుంటే గొంతు విప్పండీ..!

  Jan 13 | కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై మరోమారు బీజేపి సీనియర్ నేత, మాజీ అర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా పరోక్ష విమర్శలు ఎక్కుపెట్టారు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు న్యాయమూర్తులను అదర్శంగా తీసుకుని కేంద్రంలోని క్యాబినెట్ మంత్రులు... Read more

 • Hyderabad police burst hitech prostitution racket

  హెటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు..

  Jan 13 | పండుగ వేళ ఎవరికి వారు సంబరాల్లో మునిగి తేలేందుకు సిద్దమవుతున్న క్రమంలో.. సందేట్లో సడేమియాలు మాత్రం తమ వ్యాపారాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకుంటున్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఎక్కడికక్కడ దాడులు... Read more

 • Court sentences two years jail term for mlc srinivas reddy

  ఎమ్మెల్సీకి రెండేళ్ల జైలు.. జరిమానా..

  Jan 13 | అధికారంలో వున్నవారైనా, విపక్షంలో వున్నవారైనా కేసులు పెట్టిన తరువాత మాత్రం చట్టం చట్రం నుంచి తప్పించుకోలేరు. ఎవరికీ చట్టం చుట్టం కాదు అని మరోమారు రుజువైంది. విధినిర్వహణలో ఉన్న సీఐపై దాడికి పాల్పడిన కేసులో... Read more

 • Hyderabadis went to native police security beeed up

  పల్లెకు నగరవాసి.. ముమ్మరమైన పోలీసు గస్తీ..

  Jan 13 | ఉదయాన్నే బోగి మంటలు, బందువులు, మిత్రులు, శ్రేయోభిలాషుల పలకరింపులు క్షేమసమాచారాలు ఆ తరువాత అభ్యంగన స్నానాలు.. ఇక ఊరూ వాడా అంత ఒక్క చోట చేరి సరదాగా అటలు అడుకునే సంప్రదాయకర పండుగ రోజును... Read more

 • Trs mla srinivas goud too travels in nayini way

  నాయిని బాటలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్..

  Jan 13 | తెలంగాణ రాకుమునుపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బండబూతులు తిట్టినోళ్లు.. తెలంగాణ అడ్డుకునేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించోనోళ్లు.. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించిన తరువాత అదే కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రులుగా కొనసాగుతున్నారని, సంచలన వ్యాఖ్యలు చేసిన... Read more

Today on Telugu Wishesh