Advance rail booking period extended to 360 days రైల్వే ముందస్తు రిజర్వేషన్ ఇక ఏడాది ముందుగానే..

Advance rail booking period extended to 360 days for foreigners

foreign tourists, train tickets, advance booking, railway tickets, Indian Railways, IRCTC, NRI travellers, foreigners

Foreign tourists can now book train tickets 360 days in advance from abroad instead of the present 120 days. Indian Railways would announce the facility this week.

రైల్వే ముందస్తు రిజర్వేషన్ ఇక ఏడాది ముందుగానే..

Posted: 07/04/2017 02:42 PM IST
Advance rail booking period extended to 360 days for foreigners

అయినవారికి అకుల్లోనూ కానీ వారికి కంచాల్లోనూ అన్న నానుడి గుర్తుందా..? సరిగ్గా ఇదే నానుడిని అసుసరిస్తుంది భారత్ రైల్వే శాఖ. నిత్యం లక్షలాధి మందిని అత్యంత చౌక ధరకు వార్వారి గమ్యస్థానాలకు చేర్చుతూ.. లాభాలను అర్జిస్తున్న రైల్వే శాఖ.. మనవారికి ఒక విధమైన ముందస్తు రిజర్వేషన్ పద్దతిని అమలు పరుస్తూ.. విదేశాలలో స్థిరనివాసాలు ఏర్పర్చుకుని స్వదేశీ పర్యటనకు వచ్చేవారికి.. వీరితో పాట భారత పర్యటనకు వచ్చే విదేశీ పర్యాటకులకు మాత్రం మరో విధమైన పద్దతిని అవలంభిస్తుంది.

సాధారణంగా దేశీయ ప్రయాణికులు రైల్వేలో ప్రయాణించాలంటే మూడు నెలల ముందు వరకే రైల్వే రిజర్వేషన్ చేసుకొనే సదుపాయం ఉంది. అయితే దేశంలో పర్యటించాలనుకునే విదేశీ పర్యాటకులకుమాత్రం ఏడాది ముందుగానే రైలు టికెట్లను బుక్‌ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు వారికి ఈ సుదుపాయాన్ని కల్పించే పనిలో భారత రైల్వే శాఖ నిమగ్నమైంది. మరో వారంలో ఇందుకు సంబంధించిన ప్రకటనను రైల్వేశాఖ వెలువరించనుంది. విదేశీ పర్యాటకులు, ప్రవాస భారతీయులను ఆకర్షించేందుకు రైల్వే ఈ మేరకు కొత్త సుదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

అయితే వీరికి అన్ని సీట్లు అందుబాటులో మాత్రం వుంచని రైల్వేశాఖ.. ఒక మెలిక మాత్రం పెట్టనుంది. వీరు కేవలం ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్లను మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజధాని, శతాబ్ధి, గతిమాన్‌, తేజస్ రైళ్లలో 360 రోజుల ముందుగానే టికెట్లు అందుబాటులో ఉంచుతారు. వీరు థర్డ్‌ ఏసీ, సెకండ్ స్లీపర్‌ టికెట్లను బుక్ చేసుకునే అవకాశం లేదు. చివరి నిమిషంలో జర్నీ చేయాలనుకునే వారు ప్రత్యేక రైళ్లలో టికెట్లను బుక్ చేసుకోలేరు.

అయితే భారత రైల్వే శాఖ ఇటీవల టిక్కెట్ల కాన్సిలేషన్ ద్వారా గత ఏడాది 1470 కోట్ల రూపాయలను అర్జించిన నేపథ్యంలో ఈ అదాయంతో పాటు సర్వసాధారణంగా అన్ని ప్రయాణాల్లో ఖాళీగా కనిపించే సిట్లను భర్తీ చేసి అధికాదాయాన్ని సమకూర్చుకునే పనిలో భారత రైల్వే శాఖ నిమగ్నమైందన్న వార్తులు వినిపిస్తున్నాయి. విదేశీ పర్యటకులకు, ప్రవాస భారతీయులకు కూడా సాధారణ ప్రయాణికులకు మధ్య ఒక్క విషయంలో మాత్రం సమన్యాయం చేసింది రైల్వే శాఖ. అదే కాన్సిలేషన్ అప్ టిక్కెట్. ముందుగా బుక్ చేసుకున్న టిక్కెట్లను రద్దు చేసుకన్న పక్షంలో అందరి మాదిరిగానే 50శాతం మినహాయించుకుని మిగిలిని 50 శాతాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles