Can't ban people from depositing old notes, says SC రద్దు చేసిన పాత నోట్లపై రిజర్వు బ్యాంకుకు సుప్రీం అదేశాలు

Can t ban everyone from depositing old notes says supreme court

Notes ban, Demonetisation, Supreme Court, PM Modi, Union Government, reserve bank, old currency notes, centre

The Supreme Court admonished the Centre in strong language on Tuesday giving it two weeks to respond on whether citizens will get another chance to deposit demonetised notes.

రద్దు చేసిన పాత నోట్లపై రిజర్వు బ్యాంకుకు సుప్రీం అదేశాలు

Posted: 07/04/2017 01:01 PM IST
Can t ban everyone from depositing old notes says supreme court

వంద మంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్షను విధించరాదన్న సూత్రాన్ని అపారంగా విశ్వసించే న్యాయవ్యవస్థ మనదన్న విషయాన్ని ఇవాళ దేశ నర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోమారు రుజువు చేసింది. అక్రమంగా నల్లధనాన్ని కూడబెట్టుకున్నా పలువురు వాటిని మార్చుకున్నా పర్వాలేదు కానీ నిజాయితీ పరులు మాత్రం నోట్ల మార్పిడితో ఇబ్బందులు పడరాదని అత్యున్నత న్యాయస్థానం ఇవాళ మరోమారు స్పష్టం చేసింది.

నవంబర్‌ 8న రాత్రి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి ప్రసంగించిన తరువాత అకస్మాత్తుగా అదే రోజు అర్థరాత్రి నుంచి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం.. పాత నోట్లను మార్పడి చేసుకునేందుకు విధించిన గడువు.. కేవలం రెండు వారాలే. ఆ తరువాత వాటిని పెట్రోల్ బంకుల్లోనూ, ఇక ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల వారికి మాత్రం మరికొంత కాలం పాటు మార్చుకునే వెసలుబాటు కల్పించింది. అయితే ఇచ్చిన గడువు చాలా తక్కువగా వుండటం.. ఇక బ్యాంకుల వద్ద జనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరడంతో.. గడవులోపు అనేక మంది తమ నోట్లను మార్చుకోలేకపోయారు.

దీంతో పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయకుండా తమ వద్దే ఉంచుకున్న వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పాత నోట్లను కలిగి వుండటం చట్ట రిత్యా నేరమని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానాం సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. దీనిపై విచారణకు అనుమతించి చేపట్టిన సుప్రీకోర్టు ఇవాళ తాజాగా జారీచేసిన ఆదేశాలు పాత పెద్ద నోట్లు కలిగిన ప్రజలకు ఊరటను ఇచ్చాయి.

పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం మరోమారు ప్రజలకు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వు బ్యాంకును తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది. పాత నోట్ల డిపాజిట్లు ఎందుకు చేయలేదన్న విషయమై కారణాలు చూపించే ప్రజలకు ఈ వెసులుబాటు కల్పించాలని చెప్పిన న్యాయస్థానం.. తగ్గిన కారణాలు చూపించేవారిని ఇబ్బంది పెట్టవద్దని కూడా సూచించింది. నిజాయితీపరులు నష్టపోకుండా చూడాలని పేర్కొంది. డీమానిటైజేషన్‌ గడువు తరువాత రద్దయిన నోట్లను డిపాజిట్‌ చేయని వారికోసం ప్రత్యేక కౌంటర్లు ఏమైనా ఏర్పాటు చేశారా అన్న వివరాలను ఈ నెల 18లోగా తమకు తెలియజేయాలని చెప్పని న్యాయస్థానం కేసు తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles