TDP MP to finally open up about his Controversies

Kesineni nani response on controversies

Kesineni Nani, Kesineni Nani Open Up, Kesineni Nani Interview, Kesineni Nani Quit Politics, Kesineni Nani Name, Kesineni Nani Controversies, Kesineni Nani Sunil Reddy Orange Travels, Kesineni Nani Sunil Reddy, Kesineni Nani TRS, Kesineni Nani Chiranjeevi, Vijayawada Development Kesineni Nani

TDP MP Kesineni Nani to finally open up about his Controversies. If Chandrababu Ordered him he quit Politics.

నాని.. ఆల్ ఈజ్ వెల్ నిజమేనా?

Posted: 06/26/2017 01:12 PM IST
Kesineni nani response on controversies

రవాణా శాఖ అధికారిపై దాడి, ఆపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో క్లాస్ పీకించుకోవటం, తన ట్రావెల్స్ కు జరిగిన డ్యామేజ్, బీజేపీ పొత్తుపై కామెంట్లు... ఇలా ఆ మధ్య వరుస వార్తలతో టీడీపీ ఎంపీ కేశినేని నాని వార్తల్లో నిలిచిన విషయం ఎరుకే. అయితే తన వల్ల పార్టీకి ఎలాంటి చెడు జరగలేదని పైగా చాలా మంచే జరిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నాని.

తాను ఏ తప్పూ చేయలేదని చెప్పారు. ఒక ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడని... దాని గురించి తాను అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నాడు. యాక్సిడెండ్ కు గురైన బస్సు తప్పడు బస్సు అని నాకు తెలుసు. అందుకే బ్రేక్ ఇన్స్ పెక్టర్ ఇచ్చే ఒక కాపీని ఇవ్వాలని తాను అడిగాను. కానీ, సరైన స్పందన లేకుండా పోయిందన్నాడు. నిజానికి ఆ బస్సు ఆరంజ్ ట్రావెల్స్ కు చెందింది, దాని అధినేత సునీల్ రెడ్డి కడప నుంచి కృష్ణా జిల్లాకు వచ్చి, ఆ తర్వాత నిజామాబాద్ కు వలస వెళ్లాడని చెబుతుంటారని నాని తెలిపాడు.

అంతేకాదు ఈసారి నిజామాబాద్ ఎంపీగా ఆయన పోటీ చేస్తాడని కూడా కొందరు చెబుతున్నారని అన్నారు. తెలంగాణలో ఉన్నప్పుడు కవిత మనిషినని చెప్పుకుంటారని, ఏపీకి వచ్చినప్పుడు ఆరెస్సెస్ మనిషినని చెప్పుకుంటారని ఆరోపించారు. రెండు మూడేళ్ల నుంచే అతను ట్రావెల్స్ వ్యాపారంలో కనపడుతున్నాడని... ఈ మధ్య కాలంలోనే 180 బస్సులకు పెంచాడని... ఇవన్నీ అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్లే అని చెప్పాడు. క్రైం చేయడం అతనికి బాగా తెలుసని... పన్నులు కట్టకుండా బస్సులు తిప్పుతున్నారని ఆరోపణలు గుప్పించాడు. తనపై వస్తున్న విమర్శలు పట్టించుకోనన్న నాని, నియోజకవర్గం కోసం చాలా కష్టపడి పని చేస్తున్నానని... సుమారు రూ. 4 వేల కోట్ల పనులు విజయవాడకు మంజూరయ్యాయని తెలిపాడు.

చంద్రబాబు చెబితేనే...

తనని టీడీపీలోకి తీసుకొచ్చిందే చంద్రబాబు అన్న విషయం గుర్తు చేసుకున్న ఆయన చివరి వరకు టీడీపీతోనే ఉంటానని చెప్పాడు. పార్టీలోకి రాకముందు మూడు నెలల పాటు తాను ప్రజారాజ్యంలో ఉన్నానని తెలిపాడు. వ్యక్తిగతంగా చిరంజీవి చాలా మంచి వ్యక్తి అన్న నాని, పార్టీని మాత్రం సమర్థవంతంగా నడిపించలేకపోయారన్నాడు. పీఆర్పీని వీడిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని తనకు అనిపించలేదని, కానీ, చంద్రబాబు బలవంతం మేరకే మళ్లీ తాను రావాల్సి వచ్చిందని చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయమంటే చేస్తానని... 'నువ్వొద్దురా పో' అంటే, వెళ్లిపోయి కార్గో వ్యాపారం చూసుకుంటానని స్పష్టం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Kesineni Nani  Controversies  Chiranjeevi  Chandrababu Naidu  

Other Articles