Jagananna Warning Roja Just A Rumour

Roja on party change rumours

Jagan, jagan Roja, Jagan Anna Roja Chelli, Roja TDP, Roja Janasena, Jagan Not Warn Roja, Roja Janasena, Roja TDP, Roja on Rumours

Roja Condemn Party Change Rumours. Janasena TDP not At All.

ఎమ్మెల్యే రోజా ఎటకారం చూశారా?

Posted: 06/24/2017 03:42 PM IST
Roja on party change rumours

జగన్ వార్నింగ్.. రోజా మనస్థాపం... టీడీపీ లేదా జనసేన లోకి జంప్.. ఇలా గత నాలుగైదు రోజుల నుంచి ప్రముఖ పత్రికల్లో, సైట్లలో వార్తలు ఊదరగొడుతున్నాయి. దీంతో ఈ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఎమ్మెల్యే రోజా రంగంలోకి దిగింది. అసలు తాను పార్టీ మారుతున్నానా? అంటూ మీడియానే రివర్స్ లో ప్రశ్నించింది ఆమె.

ప‌వ‌న్ క‌ల్యాణ్ పెట్టిన జ‌న‌సేన పార్టీలోకి జంప్ అవుతున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌పై శనివారం ప్రెస్ మీట్ లో రోజా మండిప‌డింది. జ‌న‌సేనే కాదు, తాను టీడీపీలోకి కూడా వెళుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయ‌ని ఆమె చెబుతోంది. కులం పేరుతో తనను ఓడించేందుకు యత్నించిన చంద్రబాబు ఎక్కడా? పార్టీలోకి రాగానే ఎమ్మెల్యేను చేసిన జగన్ ఎక్కడ? ఇద్దరికీ పోలిక అంటూ విరుచుకుపడింది. ప‌నికిమాలిన టీడీపీ, తలాతోకలేని జ‌న‌సేన‌లోకి వెళ్లే అవ‌స‌రం త‌న‌కేం లేదని చెబుతోంది.

త‌న‌కు తల్లిదండ్రులు లేరని, జగన్ తనను సోదరిలా భావిస్తారని, తానిప్పుడు ఆయన రక్షణలోనే ఉన్నానని, జ‌గ‌న్‌కి తాను జీవితాంతం రుణప‌డి ఉంటానని అన్నారు. అసలు పార్టీలో ఆయన పన్నెత్తి మాట ఎవరినీ అనరని కూడా అంటోంది. త‌న‌ నుంచి నిర్ధారణ లేకుండా పార్టీ మారుతున్నాననే కొందరు తప్పుడు కథనాలు రాశారు. వాళ్లకు అసలు విలువలు ఉన్నాయా? అంటూ మండిపడింది. అనుకూల పత్రికలతోనే టీడీపీ అలాంటి కథనాలు రాయించుకుంటుందని ఆరోపణలు గుప్పించింది.

ఇక కేబినెట్ లో తాగుబోతులందరూ కూర్చుని కొత్త మద్యం పాలసీని తెచ్చారని, సారా చంద్రబాబు ప్రభుత్వం(నారా బదులు సారా అని చమత్కరించింది) రాష్ట్రంలో తాగుడును మ‌రింత విస్త‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని రోజా మండిప‌డ్డారు. ప్రజలకి అన్యాయం చేస్తే త‌మ పార్టీ ఊరుకోద‌ని తెలిపారు. తమ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత ఇప్పుడు జ‌రుగుతున్న అన్యాయాల‌పై, అక్ర‌మాల‌పై
ఉక్కుపాదం మోపుతామ‌ని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  MLA Roja  Janasena  TDP  

Other Articles