anti corrupt si punished with vr standing in nellore నిజాయితీ అధికారిపై కక్ష సాధింపు చర్యలు.. మాట్లాడరేం బాబుగారూ.?

Anti corrupt si punished with vr standing in nellore

sullurpeta police station, gudur division, sand, oter states, ruling party leaders, police higher officials, nellore district, amaravathi

sullurpeta police station si writes about the corruption in the department, to district colllector, where each si of gudur division should collect Rs. 1 crore.

నిజాయితీ అధికారిపై కక్ష సాధింపు చర్యలు.. మాట్లాడరేం బాబుగారూ.?

Posted: 06/24/2017 12:16 PM IST
Anti corrupt si punished with vr standing in nellore

ప్రజలకు శాంతిభద్రతలు కల్పించి అక్రమాలకు ఎక్కడా తావు లేకుండా చూడాల్సిన పోలీసులు.. కక్కుర్తి పడి.. ఉన్నతాధికారులు నిర్ధేశించిన టార్గెట్ లను సేకరించి వారికందించాలి. అందుకునే వారి జాబితాలో ఉన్నతాధికారులతో పాటు అధికార పార్టీ నేతలు కూడా వున్నారని సమాచారం. అయితే ఈ టార్గెట్ ఏదో కొద్దే గొప్పే అంటే ఎవరైనా సరేలే అనుకుంటారేమో కానీ.. ఏకంగా ప్రతి నెల కోటి రూపాయల టార్గెట్ వసూలు చేయడమంటే,. ప్రజల రక్తమాంసాలను పిండి డబ్బులను వసూలు చేయడమేనని భావించిన ఓ ఎస్ఐ.. తన అవేదనను ఏకంగా జిల్లా కలెక్టర్ కు మొరపెట్టుకుంటూ లేఖను రాసి.. ఇప్పడు గంజాయి వనంలో తులసిమొక్కలా మిగిలాడు.  

ఈ మొత్తం రాబట్టేందుకు ఎందరినో హింసించాలి.. అది చట్టవిరుద్దం.. ఇక కంచె చేను మేసినట్లుగా ఇసుకను కూడా మేమే అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించాలి.. ఇంకా ఎన్నో చేయాలి.. ఇలా కోటి మొత్తాన్ని వసూలు చేసే లోపు మరో నెల వచ్చేస్తుంది. ఇలా ప్రతి నెలా వసూలు చేయడం నా వల్ల కావడం లేదు. మీరైనా చర్యలు తీసుకోండి’... అంటూ శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ఎస్‌ఐ ఏకంగా జిల్లా కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా మొరపెట్టుకున్నారు. ఆ ఎస్‌ఐ ఆవేదన అర్థం చేసుకుని చర్యలు తీసుకోవాల్సిన కలెక్టర్.. దీనిపై మీరే చర్యలు తీసుకోండీ అంటూ ఏకంగా ఆయనకే లేఖను పంపారు.

ఇంకేముంది.. ఆ లేఖ రాజకీయ, అధికారవర్గాల్లో తీవ్ర సంచలనం కలిగించింది. కానీ దీనిపై రాజకీయ పెద్దలు భగ్గుమన్నారు. ఆ ఎస్ఐపై కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించాలని అదేశించారు. దీంతో గూడూరు డివిజన్‌ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని  సూళ్లూరుపేటలో పనిచేస్తున్న ఎస్‌ఐపై చర్యలకు ఉఫక్రమించారు ఉన్నతాధికారులు.

అయితే ఎస్‌ఐ ఫిర్యాదుపై విచారణ జరిపించాల్సిన కలెక్టర్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో ఉలిక్కిపడ్డ పోలీస్ ఉన్నతాధికారులు హుటాహుటినా ఆ ఎస్ఐపై బదిలీ వేటు వేశారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వకుండా వేకెన్సీ రిజర్వు(వీఆర్‌)లో ఉంచారు. అయితే తనకు తాను అన్నాహాజరే లాంటి అవినితీ వ్యతిరేక ఉద్యమకారుడిగా ప్రసంగాలను ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇలాంటి ఘటనలపై మాత్రం ఎందుకు స్పందించరని పలువురు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles