NDRF trails to rescue toddler meena goes in vain మరింత కిందకు జారిన మీన.. ఎన్డీఆర్ఎప్ విఫలయత్నం..

Ndrf trails to rescue toddler meena goes in vain

NDRF officialsm, ndrf trails to rescue toddler, toddler meena into borewell hole, ndrf robotic hand technology, ndrf rescue trails goes in vain, rangareddy, ibrahimpatnam, meena, ikkareddy gudem, victim meena, telangana police, telangana,

NDRF officials trails to rescue toddler meena with robotic hand technology goes in vain, and the victim is dropped into two more feets

మరింత కిందకు జారిన మీన.. ఎన్డీఆర్ఎఫ్ విఫలయత్నం..

Posted: 06/23/2017 04:16 PM IST
Ndrf trails to rescue toddler meena goes in vain

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో బోరుబావిలో పడిన 14 నెలల చిన్నారి మీనాను రక్షించేందుకు ఎన్డీఆరఎఫ్ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రోబో టెక్నాలజీ (రోజోటిక్ హ్యాండ్)తో పాపను బోరుబావి నుంచి క్షేమంగా బయటకు తీయాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బోరుబావి నుంచి మోటార్ వచ్చిందే తప్ప పాప రాలేదు. దీంతో చిన్నారి మీనా క్షేమంగా బయటకు రావాలని కాంక్షిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు అగ్నిమాపక, సీఐఎస్ఎఫ్, రెవెన్యూ యంత్రాంగం సహకారంతో బోరులో ఉన్న మోటారును జాగ్రత్తగా తీయడం ద్వారా పాపను బయటకు లాగవచ్చని భావించి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

ఇది కాస్త రిస్క్ అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో పాపను అలా బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే ఎన్డీఆర్ఎఫ్ అధికారుల ప్రయత్నాలు విఫలం కావడమే కాకుండా మీనా మరో రెండు అడుగుల కిందకు జారిపోయింది. ఈ విషయం తెలిసిన వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే కిందకు జారిన తరువాత పాప అరుపులు ఏమీ వినిపించడం లేదని సమాచారం. దీంతో ప్రత్యామ్నాయంగా జేసీబీతో సమాంతరంగా గొయ్యి తవ్వుతున్న రెవెన్యూ అధికారులు ఇప్పటికే 30 అడుగులు భూమిని తొవ్వారు. రాతి భూమి కావడంతో రాయి ఫలకలు అడ్డువస్తున్న కారణంగా పని ఆలస్యమవుతోంది.

సహాయ చర్యలకు అడ్డుగా నిలిచిన వరుణుడు

అయితే మరో మూడు నాలుగు గంటల్లో మిగిలిన 10 అడుగుల భూమిని కూడా తొవ్వేసి.. పాపను రక్షిస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు. కాగా, పాపను సురక్షితంగా బయటకు తీసుకోచ్చేందుకు ప్రకృతి కూడా సహకరించని పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు విఘాతం కలిగిస్తున్నాయి. అయినా అధికారులు సహాయక చర్యలను నిలపకుండా కొనసాగిస్తున్నారు. దీంతో అంతా పాప క్షేమంగా బయటపడాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.  

అంతకుముందు బోరుబావిలో పడిన మీనా ప్రాణాలతో ఉందని ఎన్డీఆర్ఎఫ్ నిపుణుడు తెలిపారు. గత రాత్రి నుంచి పాపను బయటకు తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఒక మనిషిని తల్లికిందులుగా లోపలికి పంపే ఆలోచన కూడా చేశామని, ఆయితే బోరు బావి లోపలికి వెళ్లే కొద్దీ భూమి కుంగిపోకుండా వేసిన రక్షణ పైపు అంతమైపోయిందని, దీంతో భూమిలోపలి రంధ్రం నేరుగా లేదని, మధ్యలో మట్టివంటివి పడ్డాయని ఆయన చెప్పారు. ఆక్సిజన్ అందుతుండడంతో పాప ప్రాణాలతోనే ఉందని ఆయన చెప్పారు కాగా, గ్రామ పెద్దలు, చిన్నారి బంధువులు శోకసంధ్రంలో ముగిగిన పాప తల్లిదండ్రులను ఓదార్చుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు అధికారులు రాష్ట్ర ప్రజలకు నిరుపయోగంగా ఉన్న బోరుబావులను తక్షణం మూసివేయాలని హెచ్చరికలు జారీ చేశారు. బోరుబావులు తవ్విన తరువాత నీరు పడలేదని, వినియోగించడం లేదని నిరుపయోగంగా వదిలేసిన బోరుబావులను తక్షణం పూడ్చివేయాలని ఆదేశించారు. సమస్యలు ఉత్పన్నమైన తరువాత మేల్కొనే కంటే ముందుగానే చర్యలు చేపట్టడం శ్రేయస్కరం అని వారు చెప్పారు. ఇలా బోరుబావులు పూడ్చేందుకు ఎవరైనా నిరాకరించినా, నిర్లక్ష్యం చేసినా తమకు సమాచారం ఇవ్వాలని తెలంగాణ పోలీసులు ప్రకటన జారీ చేశారు. అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తమకు తెలుసని వారు స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : meena  ikkareddy gudem  victim meena  rangareddy  ibrahimpatnam  telangana police  telangana  

Other Articles