Obscene video Posted in BJP MLA's Facebook

Obscene video on mla facebook

Rajvir Diler, Rajvir Diler Video, Rajvir Diler Facebook, BJP Iglas MLA Rajvir Diler, BJP MLA Rajvir Diler, Obscene Video Rajvir Diler, Obscene Video Facebook Account, MLA Porn Video, BJP MLA Porn Video, BJP MLA Obscene Video, MLA Facebook Shock

Obscene video posted from Iglas MLA Rajvir Diler, Facebook Account shocks followers. shared from the timeline of BJP’s Iglas MLA Rajvir Diler, showed up in their social media feed.

పోర్న్ వీడియోతో బీజేపీ ఎమ్మెల్యే షాక్

Posted: 06/23/2017 09:31 AM IST
Obscene video on mla facebook

ఉత్తరప్రదేశ్ లో ఓ ఎమ్మెల్యేకు ఎదురైన చేదు అనుభవం ఆలస్యంగా వార్తల్లోకి వచ్చింది. బుధవారం రాత్రి ఆయన ఫేస్ బుక్ అకౌంట్ ను చూసిన వందల మంది కార్యకర్తలు షాక్ కొట్టింది. కారణం.. ఆయన ఫేస్ బుక్ లో ఓ పోర్న్ వీడియో ప్రత్యక్షం కావటం. దీంతో దిగ్భ్రాంతికి గురైన కార్యకర్తలు ఆయనకు ఫోన్ చేసి అసలు విషయం ఆరా తీశారు.

ఇగ్లాస్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ వీర్ ఫేస్‌ బుక్ ఖాతాలో అశ్లీల వీడియో పోస్టు అయింది. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆ వీడియో పోస్టు కాగా, ఆయన అనుచరులు సమాచారం అందించగా, వెంటనే ఆయన ఆ వీడియోను డిలీట్ చేసేశాడు. ఆ వీడియో తాను పోస్టు చేయలేదని వివరణ ఇచ్చుకున్నాడు. ప్రెసిడెంట్ ఎన్నికల సందర్భంగా జరిగిన సమావేశానికి హాజరై రాత్రి రెండు గంటల సమయంలో తాను ఇంటికి వచ్చానని, అప్పుడు కొందరు కార్యకర్తలు తనకు విషయం చెప్పటంతో దానిని తొలగించానని తెలిపాడు.

తన అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేసి, అశ్లీల వీడియో పోస్టు చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన అలీఘడ్ ఎస్పీ రాజేష్ కుమార్ పాండేకు ఫిర్యాదు చేశారు. ఐపీ అడ్రెస్ ఆధారంగా దర్యాప్తు చేసి, నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP MLA  Rajvir Diler  Obscene Video  

Other Articles