Panneerselvam Ready to Work with Rajinikanth

Panneerselvam on rajinikanth political entry

Rajinikanth, Rajinikanth OPS, OPS Rajinikanth, Panneerselvam Support Rajinikanth, Rajinikanth Panneerselvam Support, Rajinikanth OPS Support, Rajinikanth Party Team OPS, Panneerselvam On Rajini Entry

Ousting AIADMK Leader Panneerselvam (OPS) says ready to work with Rajinikanth and welcomes him into Politics. If need arises, will consider an alliance with Rajinikanth.

రజనీ పార్టీతో పొత్తుకు సిద్ధం!

Posted: 06/23/2017 09:11 AM IST
Panneerselvam on rajinikanth political entry

ఆలూలేదూ చూలూ లేదు. అయినా సరే సూపర్ స్టార్ వెనకే అంటున్నారు తమిళ తంబీలు. రాజకీయ ఆరంగ్రేటంపై ఓపక్క డిస్కషన్లు, డిబెట్లతో హోరెత్తిపోతున్న క్రమంలో రజనీ మాత్రం గప్ చుప్ గా ఉండటం తెలిసిందే. ఏదైనా ఉంటే మీడియాకు తానే చెబుతానుగా అంటూ ఓ పక్క స్టేట్ మెంట్లు.. మరోవైపు దేవుడు శాసిస్తే.. అంటూ ఫ్యాన్స్ లో ఆశలు రేపుతూ సాగుతూ వస్తోంది తలైవా వ్యవహారం.

ఇదిలా ఉంటే తమిళ రాజకీయాల్లో సమూల మార్పులు తెచ్చే అవకాశం ఉండటంతో రజనీతో ఇప్పటి నుంచే స్నేహ హస్తం అందించేందుకు పలు పార్టీలు సిద్ధమైపోతున్నాయి. డీఎంకే చీఫ్ స్టాలిన్ తో రజనీ క్లోజ్ గా మెదులుతున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షంతో చేతులు కలిపే పని పని చేయబోడనే కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా అమ్మ అనుచరుడు పన్నీర్ సెల్వం కూడా రజనీవైపే మొగ్గు చూపేలా వ్యాఖ్యలు చేశాడు.

రజనీ రాజకీయాల్లోకి వస్తే పొత్తుకు తాము రెడీ అంటూ ఓ ఇంటర్వ్యూలో ఓపీఎస్ తెలిపాడు. అయితే రాజకీయ రంగప్రవేశంపై రజనీ ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదని గుర్తు చేస్తున్నాడు. అయినప్పటికీ భవిష్యత్ లో వస్తే గనుక ఆయన పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. మరోవైపు పళని స్వామి ఇంకా శశికళ అడుగుజాడల్లోనే నడుస్తున్నాడని, తాము మాత్రం పార్టీ, ప్రభుత్వాన్ని ప్రజలకు నచ్చేవిధంగా, ప్రజలు మెచ్చే విధంగా నడిపించాలని కోరుతున్నామని ఆయన చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Political Entry  O Panneerselvam  

Other Articles