Technical Error leads to Earthquake False Alarm in Santa Barbara

False alaram shivers santa barbara

Santa Barbara, Santa Barbara Earthquake, Santa Barbara Fake Earthquake, Santa Barbara USGS, U.S. Geological Survey, Fake earthquake Alaram, Technical Error Fake Earthquake, Fake Alaram Shivers US

The U.S. Geological Survey sent out an alert Wednesday for a large 6.8-magnitude earthquake off the coast of Santa Barbara, California, but it all turned out to be a false alarm. Scientists at the University of California Santa Barbara were adjusting records of an earthquake that struck just off the U.S. West Coast in 1925, and when they shifted the precise epicenter of that century-old quake by 10 kilometers, a live alarm inadvertently went out on the USGS email server and was flashed to newsrooms and scientists worldwide.

కంప్యూటర్ మిస్టేక్.. అల్లకల్లోలం

Posted: 06/23/2017 08:43 AM IST
False alaram shivers santa barbara

‘ఏ మ్యాన్ కెన్ మేక్ ఏ మిస్టేక్.. బట్ ఏ మెషిన్ కెన్ నాట్’ అనే ఓ నానుడి ఉంది. కానీ, అవి తయారు చేసేది కూడా మనిషే అన్న విషయం గుర్తుంచుకోవాలి కదా. సరిగ్గా కాలిఫోర్నియాలో ఇలాంటి ఓ తప్పిదమే జనాలను అల్లకల్లోలం చేసి పడేసింది. వార్త ఛానెళ్ల బ్రేకింగ్ న్యూస్ తో ప్రాణాలు అర చేతిలో పట్టుకుని జనాలు బిక్కు బిక్కుమంటూ గడిపారు. అసలేం జరిగిందంటే...

అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) బుధవారం సాయంత్రం సాంటా బార్చరా తీరంలో భారీ భూకంపం వచ్చే సూచనలు ఉన్నాయంటూ హెచ్చరిక జారీ చేసింది. అంతే, అన్ని న్యూస్ ఛానెళ్లు అలర్ట్ అయ్యాయి. క్షణాల్లో అంతటా బ్రేకింగ్ న్యూస్ పాకిపోయింది. అమెరికా మొత్తం ఉలిక్కిపడింది. ప్రజలంతా అప్రమత్తమయ్యారు. అయితే తర్వాత తాపీగా అది సాంకేతిక తప్పిదం అంటూ అధికారులు చల్లగా కబురు చెప్పారు.

రిక్టర్‌ స్కేలుపై 6.8 త్రీవతతో భూకంపం రావడం నిజమేనని...అయితే ఆ భూకంపం తాజాగా సంభవించినది కాదంట. 92 ఏళ్ల క్రితం అంటే 1925లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించగా, కంప్యూటర్ లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా ఆనాటి మెసేజ్ మళ్లీ అలరమ్ గా మోగిందంట. దీంతో భూకంపం రాబోతుందని పొరబడ్డామని, మళ్లీ అన్నీ సరిచూసుకోగా భూకంపం హెచ్చరిక సాంకేతిక తప్పిదమని అర్థమైందని అధికారులు తెలుపుతూ ప్రజలకు క్షమాపణలు తెలిపింది. స్పానిష్ లు ఎక్కువగా ఉండే సాంటా బర్బరా సముద్ర తీరంతో వాణిజ్య ప్రాంతంగా విరజిల్లుతుంది. అప్పటి భూకంపం కారణంగా 8 మిలియన్ల నష్టం వాటిల్లటంతోపాటు 13 మంది చనిపోయారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : U.S. Geological Survey  earthquake Alaram  Santa Barbara  

Other Articles