Child Falls into Borewell Rescue Works Continues

Child falls into borewell in chevella

Chevella News,Chevella Borewell, Girl Fall in Borewell, Borewel Mishap, Telangana Girl Fall Borewell, 2 Years Old Baby Bore Well, Bore Well Baby, Girl Fall Bore Well Chevella, Chevella Mishap, KTR Chevella Borewell Mishap, Borewell Chinnari Alive

18 months old girl falls into borewell, rescue operations underway in Chevella. Minister Mahender Reddy Collector Paricipate Rescue Works.

ITEMVIDEOS:ప్రాణాల కోసం పోరాటం

Posted: 06/23/2017 08:13 AM IST
Child falls into borewell in chevella

అధికారుల నిర్లక్యం మరో పసి ప్రాణాలను ఊగిసలాటలో పడేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో బోరుబావిలో చిన్నారి మీనా నిన్న సాయంత్రం(గురువారం) పడిపోగా, రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. స్వయంగా మంత్రి మహేందర్ రెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకోవటంతో రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సంఘటనా స్థలంలో రాత్రి నుంచి అధికారులతో మంత్రి సహాయకచర్యలు పర్యవేక్షిస్తున్నాడు.

వికారాబాద్‌ జిల్లా యాలాల్‌ మండలం గోరేపల్లికి చెందిన కొటం యాదయ్య, రేణుక దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు. వీరు బతుకు దెరువుకోసం చేవెళ్ల మండలం చన్‌వెల్లి వచ్చి తిరుమలి రాంరెడ్డి వద్ద పాలిహౌజ్‌లో పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే పొలం పనులలో నిమగ్నమయ్యారు. రోడ్డు పక్కనే ఉన్న చెట్టు కింద పెద్దపాప అక్షిత(2), మరోపాప (18 నెలలు) ఆడుకుంటున్నారు. సాయంత్రం 6.20 ప్రాంతంలో ప్రమాదవశాత్తు అక్కడి బోరుబావిలో చిన్నారి పడిపోయింది. అక్షిత ఏడుస్తూ తండ్రి వద్దకు పరుగెత్తుకెళ్లి జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు బోరువైపు పరుగులు తీశారు. లోపల చిన్నారి పడి ఉండటాన్ని గమనించి, చుట్టు పక్కల పొలాల వద్ద ఉన్న రైతులకు తెలిపారు. వారు పోలీసులకు సమాచారం అందించగా, ఆపై సీఐ, మంత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు.



ముందుగా పాపకు ఆక్షిజన్ అందించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. అలాగే సమాంతరంగా గోతిని తవ్వే ప్రయత్నం ప్రారంభించామని ఆయన చెప్పారు. ఈ లోపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి లోపలికి కెమెరాను పంపి, పాప ఎంతలోతులో ఉందో నిర్ధారించారని అన్నారు. ఆ తరువాత పాపను తీసేందుకు ప్రత్యేక పరికరాలతో ప్రయత్నాలు ప్రారంభించారని ఆయన చెప్పాడు. నీళ్లు పడని బావులను వెంటనే పూడ్చేలా చూసుకోవాలని గతంలో గ్రామాధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ వారు పట్టించుకోకపోవటం, యజమాని రాంరెడ్డి కూడా దానిపై ఓ గోనె సంచిని కప్పి ఉంచటం, ఇటీవల వర్షాలకు నీళ్లు పడ్డాయేమోనని తెరిచిపెట్టడంతో ఇంతటి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతూనే... కొచ్చి నుంచి ప్రత్యేక టీం రంగంలోకి దిగగా, రోబోటిక్ చేతితో పాపను బయటికి తీసే యత్నం చేస్తున్నారు. నుంచి పాప క్షేమంగా రావాలని ఉత్కంఠగా అంతా ఎదురు చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chevella  Child  Borewell  Resuce Operation  

Other Articles