Solapur Farmer Demand on his Dead Body

Debt ridden farmer in suicide note demands cm visit village

Farmer Suicide, Farmer Suicide Note, Maharashtra Farmer Suicide, Maharashtra Death, Maharashtra Farmer Agitation, Maharashtra Farmer CM Fadnavis, Fadnavis Deceased Farmer Family, Dhanaji Chandrakant Jadhav, Farmer Suicide Note

Farmer commits suicide in Sholapur. 'Don't cremate my body until Maharashtra CM Fadnavis visits,' writes debt-ridden farmer in suicide note. Family refuses to cremate body unless CM Devendra Fadnavis Visit Their Village.

సీఎం వస్తేనే ఆ శవాన్ని పూడ్చేది

Posted: 06/08/2017 05:35 PM IST
Debt ridden farmer in suicide note demands cm visit village

అన్నదాతల ఆందోళనతో ఓవైపు దేశంతా అట్టుడికి పోతుంది. మధ్యప్రదేశ్ లో మందాసార్ లో రైతులను కాల్చి చంపిన ఘటన. రాహుల్ అరెస్ట్ అంతా నాటకీయ పరిణామాలను తలపిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే రైతుల నిరసన ప్రదర్శనలు ఉధృతంగా జరుగుతుండటం విశేషం.

ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఓ రైతు సూసైడ్ సంచలనంగా మారింది. షోలాపూర్ జిల్లాలో వీట్ అనే గ్రామంలో ధనాజీ జాదవ్ అనే రైతు అప్పుల బాధతో గత రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోతూ ‘‘ధనాజీ చంద్రకాంత్ జాదవ్ అనే నేను ఓ రైతు. ఈరోజు ఆత్మహత్యకు పాల్పడుతున్నాను. నా శవాన్ని గ్రామానికి తీసుకెళ్లండి. కానీ, ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్ వచ్చి చూశాకే ఖననం చేయండి’’ అంటూ అందులో పేర్కొన్నాడు. దీంతో బంధువులు శవంతో కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు.

ధనాజీకి 2.5 ఎకరాల సాగు భూమి ఉంది. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పొలం కోసం 60 వేల అప్పు చేశాడని పోలీసులు చెబుతున్నారు. రైతు ఆత్మహత్యతో రైతు సంఘాలు ఆ ప్రాంతంలో బంద్ ను నిర్వహించాయి. పరిస్థితి చేజారకుండా బందోబస్తును కట్టుదిట్టం చేశారు. కాగా, గతేడాది అక్టోబర్ 31 లోగా రైతుల రుణమాఫీ చేస్తానని ఫడ్నవీస్ హామీ ఇవ్వగా ఇప్పటికీ అది నెరవేరలేదు. బీజేపీకి వ్యతిరేకంగా శివసేన కూడా నిరసన చేపట్టింది. ఒక్క మాఫీనే కాదు.. తమకు అవసరమైన సాయం కూడా చేయాలంటూ రైతు సంఘాలు ఆందోళనను తీవ్ర తరం చేసేందుకు యత్నిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharashtra  Farmer Suicide  CM Devendra Fadnavis  

Other Articles