Banks to charge for UPI transactions మొబైల్ బ్యాంకింగ్ పై బాదుడుకు రంగం సిద్దం..

Hdfc bank sbi to start charging for p2p payments on upi

Banks, HDFC, sbi, peer-to-peer payments, UPI, NPCI, digital transactions, cashless economy, demonetisation, UPI, hdfc bANK, sbi, cHARGE, Extra charge, Transaction, P2P payments, HDFC Bank, SBI to start charging for P2P payments on UPI

Nearly two years after operationalisation of the Unified Payment Interface (UPI), banks have started moving to charge for peer-to-peer payments on the new platform.

మొబైల్ బ్యాంకింగ్ పై బాదుడుకు రంగం సిద్దం..

Posted: 06/07/2017 12:57 PM IST
Hdfc bank sbi to start charging for p2p payments on upi

బ్యాంకులు తమ అసలు ఉద్దేశానికి స్వస్తి పలికి అదాయ ఆర్జన కోసం కొత్త తరహా బాదుడు రంగం సిద్దం చేసుకుంటున్నాయి. దేశంలో ఇక నగదు రహిత లావాదేవీలే జరగాలని.. అందుకోసం అనేక విప్లవాత్మక మార్పులతో చర్యలు చేపడుతున్న కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూనే బ్యాంకు తమ కస్టమర్లపై కొత్తరకం ఛార్జీలను వడ్డించనున్నాయి. మీ మొబైల్ లో మీ బ్యాంకు యాప్ తో పాటు పలు వాలెట్ ల నుంచి మనీ ట్రాన్స్ ఫర్ చేస్తున్నారా..? ఇన్నాళ్లు ఉచితంగా మొబైల్ యాప్ నుంచి బ్యాంక్ ఖాతా సేవలను వినియోగించుకున్న కస్టమర్లు.. జాగ్రత్తా సుమా ఇకపై ఇలాంటి మనీ ట్రన్స్ ఫర్ సేవలకు చార్జీలు పడనున్నాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ద్వారా చేసే పీర్-టూ-పీర్ పేమెంట్లకు(మొబైల్ ద్వారా జరిపే డిజిటల్ చెల్లింపులు)లకు కూడా బ్యాంకులు ఛార్జీలను వడ్డించనున్నాయి.

యూపీఐ లావాదేవీలపై కొత్త ఫీజుల విధింపు, అలాగే ఫండ్స్ ట్రాన్సఫర్ చేసేటప్పుడు విధించే చార్జులను కస్టమర్లకు సవివరంగా వివరిస్తూ..  ఇప్పటికే మెసేజ్ లను పంపింది. వచ్చే నెల పది తేదీ నుంచి తమ చార్జీలు ప్రారంభమవుతాయని తెలిపింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ కలిగిన భ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అప్ ఇండియా కూడా ఇదే విధంగా చార్జీలను వడ్డించనుంది. ఈ నేపథ్యంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్ డీ ఎఫ్ సీ కూడా జూలై 10 నుంచి వీటిని అమల్లోకి తేవడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇక స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా వచ్చే రెండు మూడు నెలల్లో యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వేయనున్నట్టు తమ వెబ్ సైట్లో పోందుపర్చింది.
 
మొబైట్ లావాదేవీలపై హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు వేసే ఛార్జీలు 25వేల రూపాయలకు లోపు లావాదేవీలకు మూడు రూపాయలు దాంతో పాటు పన్నులు ఉంటాయి. 25వేలకు పైనుంచి లక్ష లోపు లావాదేవీలకు  ఐదు రూపాయల ఛార్జీ, ప్లస్ పన్నులు ఉంటాయని తెలిసింది. ఇక అంతకన్నా అధికంగా జరిపూ లావాదేవీలకు ఎంత మేర చార్జీలు, పన్నులు విధిస్తారన్న విషయం మాత్రం పొందుపర్చలేదు. ఇక భారతీయ స్టేట్ బ్యాంకు మాత్రం లక్ష లోపు లావాదేవీలకు ఒక్క రూపాయి.. లక్ష నుంచి రెండు లక్షల మధ్య లావాదేవీలకు 15 రూపాయలు, రెండు నుంచి ఐదు లక్షల లోపు లావాదేవీలకు 25 రూపాయల చార్జీలు విధించనుంది.

లావాదేవీలు మొబైల్ ఫ్లాట్ ఫామ్ ద్వారా రెండు బ్యాంకు అకౌంట్లు తక్షణమే ఫండ్స్ ట్రాన్సఫర్ చేసుకోవడానికి యూపీఐ పేమెంట్ సిస్టమ్ ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తీసుకొచ్చింది. పర్సన్ టూ పర్సన్, పర్సన్ టూ మర్చంట్ ట్రాన్సఫర్లకు దీన్ని వాడుతున్నారు.  అయితే యూపీఐ ద్వారా జరిగే చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు వేయొద్దని ఎన్పీసీఐ బ్యాంకులను కోరుతోంది. కాగా, ఈ నిర్ణయంపై అటు కస్టమర్లు కూడా అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

చేతిలో రెండు లక్షల రూపాయల కన్నా అధికంగా వుండకూడదని చెబుతున్న కేంద్రం.. అది నేరం కింద వస్తుందని, అందుకు జరిమానాలు కూడా విధిస్తామని చెప్పడంతో. ఇటు బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరపే వీలు లేక.. అటు నగదుతో జరిపూ అవకాశంలో.. కస్టమర్లు దిక్కుతోచని అగమ్యగోచర పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు. ప్రజల సోమ్మును దోచుకునే బ్యాంకుల ప్రయత్నాలను ఇప్పటికైనా స్వస్తి పలకాలని కస్టమర్లు కేంద్రంతో పాటు రిజర్వు బ్యాంకును అర్థస్తున్నారు. మరి కేంద్రం దీనిపై ఎప్పటి లోగా చర్యలు తీసుకుంటుందో.. లేక కేంద్రం అనుమతితోనే ఈ చార్జీల మోత మోగుతుందా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Banks  HDFC  sbi  peer-to-peer payments  NPCI  UPI  digital transactions  cashless economy  demonetisation  

Other Articles