Venkaiah Naidu Responded on CM KCR Trashes Amit Shah

Kcr misunderstand amit shah s

KCR Amit Shah, Venkaiah Nadiu KCR, Telangana CM Amit Shah, Amit Shah KCR Venkaiah Naidu, KCR Misunderstand Amit Shah, BJP Chief Amit Shah, Amit Shah Andhra Pradesh Tour, Amit Shah Vijayawada Meet, Venkaiah Naidu Full Speech Amit Shah Meet

Union Minister Responded to CM KCR comments against BJP Chief Amit Shah. No partiality in Central Funds Allocation to Telangana. KCR may misguide with Shah's statistics.

కేసీఆర్ అమిత్ షాను అపార్థం చేసుకున్నాడా?

Posted: 05/26/2017 09:42 AM IST
Kcr misunderstand amit shah s

బీజేపీ జాతీయాధ్యక్షుడు తెలంగాణ పర్యటన ఇరు పార్టీల మధ్య ఓ మోస్తరుగా విమర్శలకు దారితీసింది. కేంద్రం నిధుల లెక్కపై షా క్లారిటీ.. దానికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కౌంటర్ ఇవ్వటం చూశాం. ఆపై మంత్రి హరీష్ రావు కూడా టీ సీఎం లెక్కలన్నీ పక్కాగానే ఉన్నాయంటూ కేంద్రం వైఖరినే దెప్పిపొడుస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య నెలకొంటున్న ఉద్రికత్తలను కాస్త తగ్గించే పనిలో పడ్డాడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు.

అమిత్ షా చెప్పిన నిధుల లెక్కల్లో క్లారిటీ మిస్సయ్యే కేసీఆర్ అలా విమర్శలు చేసి ఉండొచ్చని వ్యాఖ్యానించాడు. నిజానికి వచ్చే ఐదేండ్లలో తెలంగాణకు ఇస్తామని షా చెప్పిన లెక్కలను ముఖ్యమంత్రి తప్పుగా అర్థం చేసుకున్నాడని, అందుకే అలా విమర్శలు చేసి ఉంటాడని అభిప్రాయపడ్డాడు. ఓ జాతీయ పార్టీ చీఫ్ గా రాష్ట్ర పర్యటనలకు వచ్చిన వ్యక్తిని తప్పుబడుతూ సీఎం స్థాయి వ్యక్తి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నాడు.

విభేదాలు పెట్టుకోవడం తమ(కేంద్రం) నైజం కాదని, అన్ని రాష్ట్రాలతో మైత్రీ బంధాన్ని కొనసాగించాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. నిధుల విషయంలో పక్షపాత ధోరణి ప్రదర్శించే వైఖరి కేంద్రంది కాదని స్పష్టం చేశాడు. విజయవాడ లో అమిత్ షా నిర్వహించిన సమావేశాన్ని నాందిగా తీసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పిన వెంకయ్య, బూత్ లెవల్ కార్యకర్తల సమావేశం విజయవంతమైందని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkaiah Naidu  Telangana  KCR  Amit Shah  

Other Articles