PM Modi to inaugurate India's longest bridge in Assam

Longest bridge in india check to china

India Longest Bridge, Assam Longest Bridge, Dhola-Sadiya Bridge, Dhola-Sadiya Bridge Inauguration, Modi Assam Tour, Longest Bridge India, Longest Bridge Modi, Longest Bridge China, Brahmaputra Lohit River Bridge, Longest Bridge in Assam, Longest Bridge in India, Modi Assam Tour, Modi 3 Years Sarkar, Three Years Modi Sarkar, Modi Government Three Years Complete, Assam Alert Modi Tour

India's Longest Bridge inaugurated by Modi in Assam Today on 3 years of Government. Dhola-Sadiya Bridge Built For Heavy Tanks to check China. Assam on high alert after Pipeline Blast.

ఇండియా లాంగెస్ట్ బ్రిడ్జి.. చైనాకు చెక్

Posted: 05/26/2017 09:12 AM IST
Longest bridge in india check to china

బ్రహ్మపుత్ర నది మెడలో మణిహారం పడింది. నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ) అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్న సందర్భంగా దేశంలోనే అతిపొడవైన బ్రిడ్జిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితమిచ్చాడు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి అస్సోం సీఎం సోనోవాల్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ హాజరయ్యారు. స్వయంగా మోదీ కారులో బ్రిడ్జి మీద కలియతిరగటం విశేషం. ఆపై కారు దిగి ఒంటరిగా బ్రిడ్జిని పరిశీలించాడు. అస్సాంలోని సాదియా, అరుణాచల్‌ప్రదేశ్‌లోని ధోలా‌లను ఈ సేతువు కలుపుతుంది. 9.15 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను బ్రహ్మపుత్రకు ఉపనది అయిన లొహిత్ పై నిర్మించారు.

అసోం రాజధాని దీస్ పూర్‌కు 540 కిలోమీటర్లు, అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనా సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపే ఉంది. వంతెన నిర్మాణం 2011లో ప్రారంభమైంది. తెలుగు కంపెనీ అయిన నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ మొత్తం రూ.2, 056 కోట్ల ఖర్చుతో ఆరేళ్లలో దీనిని నిర్మించటం విశేషం. సాదియా-ధోలా బ్రిడ్జి ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న 6 గంటల ప్రయాణ దూరాన్ని కేవలం గంటకు తగ్గించనుంది. ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్, అసోం ప్రజలు ఎయిర్‌పోర్టు, రైలు మార్గాలను వేగంగా చేరుకునే వెసులుబాటును ఈ బ్రిడ్జి కల్పిస్తోంది. ఇంతకు ముందు పెద్దదైన ముంబైలోని బాంద్రా-వోర్లి సీ లింక్ బ్రిడ్జి కంటే ఇది 3.55 కిలోమీటర్ల పొడవైనది.

 

చైనో-ఇండియా సరిహద్దుకు సమీపంలో ఉండడంతో యుద్ధ సమయంలో యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను సైన్యానికి వేగంగా చేరవేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే 60 టన్నుల యుద్ధ ట్యాంకును కూడా దీనిపై నుంచి తరలించేంత దృఢంగా దీనిని నిర్మించారు. దీంతో డ్రాగన్ కంటీ ఇటువైపు ఓ కన్నేసి ఉంచింది. ఇక ఆవిష్కరణ తర్వాత గౌహతి సభలో మోదీ ప్రసంగించాడు.

పేలుడుతో హై సెక్యూరిటీ...

ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు సరిగ్గా ఒక్క రోజు ముందు అంటే గురువారం బాంబు పేలుడుతో అసోం దద్దరిల్లింది. దిబ్రూగఢ్ జిల్లాలోని దికోమ్ చరియాలోని ఓ ఆయిల్ పైప్‌లైన్‌లో ఈ బాంబు పేలుడు సంభవించింది. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం-ఇండిపెండెంట్ (ఉల్ఫా-ఐ) ఈ బాంబును పేల్చినట్టు పోలీసులు నిర్ధారించారు. ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ తామే ఈ పనిచేసినట్టు ఉల్ఫా (ఐ) సంస్థ ప్రకటించింది. బాంబు పేలుడు జరిగిన ప్రదేశం నుంచి అనుమానిత ఉల్ఫా (ఐ) తీవ్రవాది మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు భద్రతా బలగాలు తెలిపాయి. మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Longest Bridge India  Assam  

Other Articles