Heritage Academy defends its controvesial decision వివాదాస్పదంగా మారిన ‘హెరిటేజ్’ నిర్ణయం

Heritage academy defends its controvesial decision to bar pregnant teen from graduation

Maryland, Heritage Academy, Christian school, Heritage Principal, David Hobbs, Maddi Runkles, Graduation, US

Hobbs first learned of Runkles' pregnancy in early February when her father, the former president of the school's board of directors, Scott Runkles, came to him with the news.

వివాదాస్పదంగా మారిన ‘హెరిటేజ్’ నిర్ణయం

Posted: 05/25/2017 06:51 PM IST
Heritage academy defends its controvesial decision to bar pregnant teen from graduation

హెరిటేజ్ నిర్ణయం వివాదాస్పదం అవుతుంది. ప్రతిష్టాత్మకమైన క్రిస్టియన్ పాఠశాలైన హెరిటేజ్ అకాడమీలో గర్భవతి అయిన విద్యార్థిని నిట్టనిలువునా అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో హెరిటేజ్ నిర్ణయం పై విమర్శల జడివాన కురుస్తుంది. అయినా అకాడమీ యాజమాన్యం మాత్రం తమ నిర్ణయానికి తాము కట్టబడి వున్నామని స్పష్టం చేస్తుండటం గమనార్హం. తమ అకాడమీ నిబంధనల ప్రకారం గర్బవతి అయిన యువతులు చదువుకోడానికి అనర్హులని కాలేజీ యాజమాన్యం ఖారాఖండీగా చెబుతుంది. ఈ నిబంధన ప్రకారమే విద్యార్థినిపై చర్యలు తీసుకుంటున్నామనితేల్చిచెబుతుంది.

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని మేరిల్యాండ్ లో గర్భవతి అయిన ఓ విద్యార్థినిని స్నాతకోత్సవ వేడుకకు హాజరుకాకుండా కాలేజీ యాజమాన్యం నిషేధించింది. దీనిపై ఓ వైపు విమర్శలు వెల్లువెత్తుతున్నా.. యాజమాన్యం మాత్రం నిబంధనల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని స్పష్టం చేస్తుంది. సీనియర్‌ విద్యార్థిని అయిన మ్యాడీ రంక్లెస్ లైంగిక కలాపాల్లో పాల్గొనడం.. అనైతిక చర్యేనని.. తద్వారా తమ పాఠశాల నిబంధనలను అమె ఉల్లంఘించిందని కాలేజీ ప్రిన్సిపాల్ డేవిడ్ హాబ్స్ అంటున్నారు.

అందుకే సహ విద్యార్థులతో పాటు మ్యాడీ రంక్లెస్ కు స్నాతకోత్సవ వేదికపై డిప్లోమా పట్టా అందజేయడం లేదని పేర్కొంది. ఆమె గర్భవతి అయినందుకు కాదు.. కానీ అనైతిక చర్యల్లో పాల్గొని కాలేజీ ప్రతిష్టను కాలరాసినందుకు, తమ నిబంధనలను అతిక్రమించినందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తల్లిదండ్రులకు స్కూల్ ప్రిన్సిపాల్ డేవిడ్‌ హాబ్స్ రాసిన లేఖలో పేర్కొన్నారు. 18 ఏళ్ల రంక్లెస్ 2009 నుంచి హెరిటేజ్ అకాడమీ స్కూల్ లో చదువుతున్నది.

గత జనవరిలో ఆమె గర్భవతి అని తేలింది. అప్పట్లో ఆమె తండ్రి స్కూల్ బోర్డు మెంబర్‌గా ఉండటంతో అమెను స్కూల్‌ నుంచి బహిష్కరించాలన్న నిర్ణయంతో పాటు విద్యార్థి కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తొలగించే నిర్ణయాన్ని పాఠశాల యాజమాన్యం నిలిపివేసింది. అమెవై వేసిన సస్పెన్షన్ వేటును కూడా తల్లిదండ్రులు విజ్ఞప్తితో ఉపసంహరించుకుంది. 14మంది తోటి విద్యార్థులతో కలిసి ఆమె కూడా తరగతులకు హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, స్నాతకోత్సవ వేడుకలో డిప్లమా పట్టా అందుకోవడానికి పాఠశాల అనుమతించకపోవడాన్ని తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. స్కూలు యాజమాన్యం నిర్ణయం సరైనది కాదని అంటున్నారు. వారికి అమెరికాలోని హక్కుల సంఘాలు మద్దతు పలుకుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maryland  Heritage Academy  Christian school  Heritage Principal  David Hobbs  Maddi Runkles  Graduation  US  

Other Articles