Congress Leader Jaipal Reddy ready to work with TDP

Jaipal reddy about alliance with tdp

Jaipal Reddy TDP, TDP Congress Alliance, TDP Congress against TRS, TRS Jaipal Reddy, Jaipal Reddy Interesting Comments, Congress Jaipal Reddy TDP, TDP Congress

Congress Senior Leader Jaipal Reddy about Work with TDP. Ready to alliance with ant party against BJP and TRS in Telangana. Congress is ready for alliance with TDP to defeat TRS he added.

టీడీపీ అంటరాని పార్టీ కాదు కదా!

Posted: 05/25/2017 02:13 PM IST
Jaipal reddy about alliance with tdp

తెలంగాణలో అధికార పార్టీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పరిచే యత్నాలు ముమ్మరం కాబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర రాజకీయాల్లో కనివిని ఎరుగని రీతిలో కాంగ్రెస్, టీడీపీలు జత కట్టేందుకు సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఈమేరకు ఓ ప్రకటన చేశాడు.

టీడీపీ తమకేం అంటరాని పార్టీ కాదన్న ఆయన అవసరమైతే వారితో కలిసి జత కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అయితే టీడీపీ నిర్ణయం బట్టే మా నిర్ణయం ఉంటుందని తెలిపాడు. ఇక బీజేపీ టీఆర్ఎస్ మధ్య జరుగుతున్న విమర్శల పర్వం గురించి కూడా జైపాల్ స్పందించాడు.

కేసీఆర్ కు, బీజేపీకి రహస్య ఎజెండా ఉందని, లోపాయికారీ ఒప్పందం ఉన్నప్పటికీ పైకి డ్రామాలాడుతున్నారని ఆరోపించాడు. ఇక ఇంటి పోరుకు బయపడబోమన్న సీనియర్ నేత టీఆర్ఎస్, బీజేపీ తో తప్ప అన్ని పార్టీలతో సన్నిహితంగా ఉంటామంటూ పొత్తుపై స్పష్టత ఇచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress Jaipal Reddy  TDP Alliance  Against TRS  

Other Articles